Worst Eating Habits: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి
అతిగా తినడం, బరువు పెరగడం... ఇప్పుడు సర్వసాధారణ సమస్య. కానీ అదే ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది.
మీకు తెలుసో, తెలియకో కొన్ని చెడు ఆహారాపు అలవాట్లు అలవాటై ఉంటాయి. వాటిని మీ సంకల్ప శక్తితో జయించాల్సిన సమయం ఇది. ఎందుకంటే మానవాళిపై వింతరోగాలు, వైరస్ లు దాడి చేస్తున్న వేళ... ఆహారం ద్వారా, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా మనల్ని మనమే కాపాడుకోవాల్సిన తరుణమిది. మీకు కింద చెప్పిన చెడు అలవాట్లు ఉంటే వెంటనే వదిలించుకోండి.
1. తెలివిలేకుండా తినడం
ఎదురుగా ఒక పెద్ద బకెట్ పాప్ కార్న్ పెట్టి చూడండి... కొంతమంది ఆగకుండా తినేస్తుంటారు. కనీసం ఎంత తింటున్నామో అన్న ధ్యాస కూడా ఉండదు. కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 45 శాతం మంది సినిమాహాళ్లలో తమకు తెలియకుండానే కంటైనర్లతో పాప్ కార్న్ లు లాగించేస్తున్నారు. ఎంత పరిమాణం తింటున్నాము అన్నదానిపై మీకు ఒక క్లారిటీ ఉండాలి.
2. అర్థరాత్రి చిరుతిళ్లు
బరువు తగ్గాలనుకునేవారు అర్థరాత్రి ఆహారం తినకూడదని సూచిస్తున్నాయి పరిశోధనలు. అర్థారాత్రి తినే ఆహారం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
3. స్నాక్స్ నములుతూ ఉండడం
ఇది పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా అధికంగా కనిపిస్తున్న సమస్య. సాల్టీ చిప్స్, కూల్ డ్రింకులు, మిఠాయిలు, జంక్ ఫుడ్... ఏదో ఒకటి పంటికిందకి లేకపోతే చాలా మంది విలవిలలాడిపోతారు. కానీ ఈ అలవాటు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
4. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం
అల్పాహారాన్ని చాలా మంది స్కిప్ చేస్తుంటారు. అది చాలా చెడు అలవాటు. రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం బ్రేక్ ఫాస్ట్. మీరు ఉదయం తినే ఆహారమే రోజంతా మీ చురుకుదనాన్ని కాపాడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తినకుండా మధ్యాహ్న భోజనం ఎక్కువ లాగించినా ఫలితం ఉండదు.
5. బాధలో ఎక్కువ తినయడం
ఆఫీసులోనో, ఇంట్లోనో చిన్న గొడవ అయినప్పుడు కొంతమంది ఎమోషనల్ అవుతారు. ఆ బాధలో ఏం చేయాలో తెలియక ఫ్రిజ్ తెరిసి కనిపించిందల్లా తింటుంటారు. భావోద్వేగాల వల్ల కూడా తినాల్సిన దాని కన్నా ఎక్కువ తినే అవకాశం ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు.
6. వేగంగా తినడం
భోజనం చాలా ప్రశాంతంగా చేయాలి. కానీ చాలామంది గాభరాగా, వేగంగా తినేస్తారు. నిజానికి భోజనం పూర్తి చేయడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కేటాయించుకోవాలి. కానీ చాలా మంది పదినిమిషాలలోపే ముగించేస్తున్నారు. ఆ వేగంలో అతిగా తినేసే అవకాశం కూడా ఉంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read Also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: పాలలో చిటికెడు పసుపు... దీని వేడి ముందు చలి మంట కూడా బలాదూర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి