అన్వేషించండి

AP EAPCET 2025 Notification: ఏపీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2025 నోటిఫికేషన్ మార్చి 12న వెలువడింది.

AP EAPCET 2025 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సు్ల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2025 నోటిఫికేషన్ మార్చి 12న వెలువడింది. దీనిద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 19 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది.

వివరాలు..

* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్)-2025

ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2025 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

➥ ఫార్మా-డి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2025 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు..

➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.04.2025.

➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు: మే 19 నుంచి 27 వరకు

Website

AP EAPCET 2025 Notification


AP EAPCET 2025 Notification: ఏపీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

ALSO READ:

ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే
ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 (AP ICET 2025) నోటిఫికేషన్‌ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీని ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైమ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.650, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.550 చెల్లించాలి.
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్, అప్లికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget