అన్వేషించండి

Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

మతిమరుపుకి మందు లేదు. ఇది వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే తప్ప ఏమి చేయలేము.

Alzheimer's: ఆస్ట్రేలియన్ పరిశోధకులు, భారతీయ సంతతికి చెందిన వారితో కలిసి సరికొత్త రక్తపరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి రావడానికి 20 సంవత్సరాల ముందే దీన్ని గుర్తించవచ్చు. నాన్ ఇన్వాసివ్ రక్తపరీక్ష ద్వారా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ANU) నుంచి భౌతిక శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ఉపయోగించేందుకు కృత్రిమ మేధస్సు (AI)తో కలిసి రక్తంలోని ప్రోటీన్ ని పరిశీలిస్తారు. ఇది న్యూరోడెజెనరేషన్ సంకేతాలు శోధించేందుకు ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రారంభాన్ని ఇది కనిపెట్టి చికిత్స తీసుకునేందుకు సహాయపడుతుంది.

భౌతిక శాస్త్రవేత్తలు నానోపోర్స్ కలిగిన అతి సన్నని సిలికాన్ చిప్ ని అభివృద్ధి చేశారు. ఇది అధునాతన AI అల్గోరిథం సహాయంతో ప్రోటీన్‌లను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తుంది. సిలికాన్ చిప్ మీద కొద్ది మొత్తంలో రక్తం ఉంచి మొబైల్ ఫోన్ పరిమాణంలో ఉన్న పోర్టబుల్ పరికరంలో దాన్ని ఉంచుతారు. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రారంభానికి సంబంధించిన సంకేతాలని గుర్తించడంలో ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ కి చికిత్స లేనప్పటికీ 20 ఏళ్ల లోపు ఎవరైనా తమకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అల్జీమర్స్ ప్రమాద స్థాయిని ముందుగానే కనుగొనగలిగితే జీవనశైలిలో మార్పులు చేసుకుని వ్యాధి పురోగతిని తగ్గించుకోవచ్చు.

ఈ అల్గోరిథం పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్‌తో సహా ఒకే సమయంలో బహుళ నాడీ సంబంధిత పరిస్థితులను పరీక్షించడానికి ఉపయోగపడుతుందని పరిశోధన బృందం తెలిపింది. అల్జీమర్స్ వ్యాధి మెదడుని తీవ్రంగా దెబ్బతీస్తుంది. సమర్థవంతమైన చికిత్స కోసం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ముఖ్యం. రక్తంలో పది వేల కంటే ఎక్కువ విభిన్న జీవఅణువులు కలిగి ఉండే సంక్లిష్ట ద్రవం. అధునాతన వడపోత పద్ధతులు ఉపయోగించి ఇంటెలిజెంట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అంతుచిక్కని ప్రోటీన్ లు కూడా గుర్తించగలమని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

అల్జీమర్స్ కి వ్యాక్సిన్

ఇప్పటి వరకు అల్జీమర్స్ కి సంబంధించి ఎటువంటి మందులు లేవు. ప్రస్తుతం ఈ వార్త కాస్త సంతోషాన్ని కలిగించేది. ఎందుకంటే అల్జీమర్స్ రావడానికి 20 ఏళ్లు ముందుగానే గుర్తించడం వల్ల భవిష్యత్ లో వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. మెదడులోని ప్లేక్స్ అని పిలిచే ఫలకాలలోని కణాలు అతిగా కుచించుకుపోవడం, కొన్ని మెదడు కణాలు మరణించడం వల్ల  మతిమరుపు వస్తుంది. మతిమరుపు వ్యాధిని నయం చేసేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.  బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అలాగే ఓ కొత్త ఔషధాన్ని కూడా కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్, ఔషధం మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ కచ్చితంగా అల్జీమర్స్ వ్యాధిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Pahalgam Terrorist Attack: ప్రభాస్ సినిమాకు పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ... ఆ హీరోయిన్‌ను తీసేయాలని డిమాండ్!
ప్రభాస్ సినిమాకు పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ... ఆ హీరోయిన్‌ను తీసేయాలని డిమాండ్!
Smart Umpiring in IPL 2025: ఫ్లయింగ్ కెమెరాల నుంచి సౌండ్ సెన్సార్ల వరకు, IPL 2025లో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ తెలుసా?
ఫ్లయింగ్ కెమెరాల నుంచి సౌండ్ సెన్సార్ల వరకు, IPL 2025లో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ తెలుసా?
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Embed widget