ఈ మధ్య కాలంలో వెబ్ సీరిస్‌లు చూస్తూ చాలామంది గబ్బిలాల్లా నైట్‌అవుట్‌లు చేసున్నారు.

వీరు కనీసం 6 గంటలైనా నిద్రలేకపోతే జీవితంపై ఆశలు వదిలేయాల్సిందే.

నిద్రపోకుండా జాగారం చేసేవారికి గుండె జబ్బులు రావడం పక్కా అని పరిశోధనలు చెబుతున్నాయి.

అమెరికన్ హార్ట్ అసోషియేషన్ సూచనల ప్రకారం పెద్దలు కనీలం 7 నుంచి 9 గంటలు నిద్రించాలి.

యంత్రాల తరహాలోనే మన బాడీ కూడా పనిచేస్తుందట. మెయింటెనెన్స్ కోసం తప్పకుండా బ్రేక్ ఇవ్వాలట.

మనం నిద్రపోయినప్పుడు బాడీలో బ్లడ్ ప్రెజర్, హార్ట్ బీట్, బ్లడ్ సుగర్ లెవెల్స్‌కు రిపైర్ వర్క్స్ జరుగుతాయట.

ఆ సమయంలో మనం మెలకువగా ఉంటే.. ఆ పనులేవీ జరగవు. దీంతో త్వరలోనే బాడీ బోరుకు వచ్చేస్తుంది.

శరీరానికి ప్రధాన ఇంజిన్‌గా భావించే గుండెకు ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట.

నిద్రలేమి వల్ల పెరిగే ఒత్తిడి కూడా గుండెను బలహీనపరుస్తుందట. దీంతో మరణం త్వరగానే వస్తుందట.

Images Credit: Pexels