ఆఫీసులో ఏసీ, ఇంట్లో ఏసీ, కారులో ఏసీ.. రోజంతా ఇలా ఏసీలో ఉంటున్నారా? ఈ హెచ్చరిక మీ కోసమే. అకస్మాత్తుగా వేడి వాతావరణం నుంచి చల్లని ఏసి రూమ్ లోకి ప్రవేశిస్తే తలనొప్పి రావచ్చు. ఇండోర్ ఎయిర్ క్వాలిటి బాగా లేకపోతే సిక్ బల్బింగ్ సిండ్రోమ్ అనే సమస్య రావచ్చు. ఏసిల వల్ల బాక్టీరియా వంటి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవచ్చు. ఎక్కువ కాలం పాటు ఏసీల్లో గడిపే వారి వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది . ఫలితంగా త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఏసి గాలిలోని తేమను తీసేస్తుంది. ఎక్కువ సమయం ఏసిలో ఉంటే చర్మం పొడిబారుతుంది. ఏసీ వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తీవ్ర తరం కావచ్చు. ఏసీ వల్ల కళ్లు పొడిబారతాయి. ఫలితంగా కళ్లు మంట, దురద, ఎర్రబారడం వంటి సమస్యలు రావచ్చు. ఏసిలో ఎక్కువ సమయం గడిపితే వాయుమార్గాలు పొడిబారి శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావచ్చు. Representational Image: Pexels