ఒక్క టేబుల్ స్పూన్ వెనిగర్లో కేవలం 3 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వెనిగర్ తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఎక్కువ తినలేరు. వెనిగర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఫలితంగా క్యాలరీల ఇన్టేక్ తగ్గుతుంది. భోజనానికి ముందు వెనిగర్ తీసుకోవడం వల్ల తీసుకునే ఆహారపు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. అంతేకాదు ఇలా భోజనానికి ముందు తీసుకునే వెనిగర్ వల్ల తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. వెనిగర్ లో ఉండే ఎసిటిక్ ఆసిడ్ వల్ల ఏఏంపీకే అనే ఎంజైమ్ ఉత్పత్తి పెరగి ఎక్కువ కొవ్వు కరుగుతుందట. అంతే కాదు ఈ ఎంజైమ్ తో లివర్ లో షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెనిగర్ లోని ఎసిటిక్ ఆసిడ్ వల్ల మెటబాలిజం మెరుగవుతుంది. ఫలితంగా శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కొవ్వుల జీవక్రియలు కూడా క్రమబద్దీకరించబడడం వల్ల క్రమంగా బరువు తగ్గుతాట. All Images Credit: Pexels