గర్భిణీలు కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారని మన పెద్దలు చెబుతుంటారు.

దీంతో గర్భిణీలకు కుంకుమ పువ్వు పెట్టడం ఆనవాయితీగా మారింది. మరి, నిజంగా అది పనిచేస్తుందా?

దీన్ని తింటే తెల్లగా అవుతారా లేదా అనేది పక్కన పెడితే.. గర్భిణీల ఆరోగ్యానికి ఇది చాలామంచిది.

ఇది తింటే బిడ్డ తెల్లగా పుడతాడనేది మాత్రం శాస్త్రీయం ఎక్కడా నిరూపణ కాలేదు.

బిడ్డ రంగును నిర్ణయించేది తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు మాత్రమే.

కుంకుమ పూల రేకలు తినడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

కుంకుమ పువ్వు జలుబు, దగ్గును నియంత్రిస్తుంది. కాబట్టి, పెద్దలు కూడా తినొచ్చు. కానీ, తెల్లగా మారరు.

కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది. అతిగా తీసుకుంటే ప్రమాదకరం కూడా. రోజుకు 1.5 గ్రాములే తినాలి.

కుంకుమ పువ్వు కేవలం కశ్మీర్‌లోని పాంపోర్‌లోనే పెరుగుతాయి. అందుకే అవి అంత ఖరీదు.

Images Credit: Pixabay and Pexels