ఆవాలు వాడకపోతే మీకే నష్టం ఆవాలు వేయని పులిహోరని ఊహించలేదు. తాళింపు పెట్టాలంటే మొదట వేయాల్సింది ఆవాలే. ఆవాలను రోజూ తినడం వల్ల మనకు తగిలిన గాయాలు త్వరగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆవాలను పొడిలా చేసి ఆ పొడిని గాయాలపై పెట్టడం వల్ల కూడా త్వరగా గాయం నుంచి బయటపడవచ్చు. ఆవాలు తినేవారిలో దంత సమస్యలు కూడా తక్కువగా వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఆవాలను మరిగించిన నీటిని తాగడం లేదా పుక్కిలించి ఉమ్మడం వంటివి చేస్తే మంచిది. పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా ఆవాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో ఆవాలు స్థానం ప్రధానమైనది. ఆవపిండితో చేసిన ఆహారాన్ని తినేందుకే ప్రయత్నించాలి. ఆవపిండి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఆవ పిండి త్వరగా బయటపడేలా చేస్తుంది.