దానిమ్మ తొక్కలతో బోలెడంత అందం దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ తొక్కలను పొడిగా చేసుకుని నీళ్లలో కలిపి తాగితే ఎంతో మంచిది. గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. దానిమ్మ తొక్కలను పొడిగా చేసి, ఆ పొడిని ముఖానికి, చేతులకు, కాళ్లకు రాసుకోండి. ఎండలోకి వెళ్లేటప్పుడు హానికరమైన కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు. దానిమ్మ తొక్క పొడిని అప్పుడప్పుడు నీళ్లలో కలిపి తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీళ్లను తాగితే గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దానిమ్మ తొక్కలను బాగా కడిగి రసం తీసి, ఆ రసాన్ని తాగితే ఎంతో మంచిది. శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా చేరుతాయి. ఒక కప్పు నీటిలో కాస్త నిమ్మరసం, ఒక స్పూన్ దానిమ్మ పొడి వేసి తాగడం అలవాటు చేసుకోవాలి. దానిమ్మ పొడిని ఒకసారి చేసి దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.