కొన్ని రకాల అలవాట్లు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు అవేమిటో తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సహజంగా వేసే ఆకలి మెకానిజం మీద ప్రభావం పడుతుంది పొగతాగడం సీఓపీడి వంటి తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. కారణం ఏమైనప్పటికీ సరిపడినంత నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా చాలా చెడ్డ ప్రభావం పడుతుంది. చాలా మందికి మల్టీ టాస్కింగ్ అలవాటు ఉంటుంది. ఇది ఒత్తిడి పెంచి అనారోగ్యాలకు కారణం అవుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి రకరకాల నెగెటివ్ ప్రభావాలు పడతాయి. తిండి మీద అత్యాశ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువ తినెయ్యడం ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. చాలా మంది ఆరోగ్యం బాలేనపుడు కూడా పనిచేస్తుంటారు. శరీరం మీద ఒత్తిడి పడి పరిస్థితి మరింత దిగజారుతుంది. Representational image:Pexels