Meat: ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించండి... ఆరోగ్యంగా ఉంటారు అంటున్న కొత్త అధ్యయనం
ఓ కొత్త అధ్యయనం చెబుతున్నదాని ప్రకారం మాంసాహారం పూర్తిగా మానేయక్కర్లేదు, తగ్గిస్తే చాలు... బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు.
శాఖాహారులు, మాంసాహారుల, వీగన్లు, మెడిటేరియన్లు... ఇలా అనేక రకాల ఆహారపద్ధతులు ఉన్నాయి. ప్రతి ఆహారవిధానంలోనూ లాభాలు, నష్టాలూ రెండు ఉంటాయి. ఈ ఆహారపద్ధతే ఉత్తమమైనది అని కచ్చితంగా చెప్పలేం. కానీ ఓ కొత్త అధ్యయనం మాత్రం మాంసాహరులకు షాకిచ్చింది. వారు మాంసానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది.
ఆహారమే కారణం...
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు నాలుగింట ఒక వంతు కారణం ఆహారమే. జంతువులు తాము తిన్న ఆహారంలో కొద్ది భాగాన్ని మాత్రమే మాంసంగా మార్చుకుంటాయి. ఇవి మీథేన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ సమస్య ఇంకా పెరుగుతుంది. మంచి ఆహారం అంటే కేవలం తిన్న మనుషులకు మాత్రమే మంచి చేసేది కాదు, పర్యావరణానికి మేలు చేసేది అవ్వాలి. మాంసాహారాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఈ అధ్యయనాన్ని జర్మనీలోని బోన్ యూనివర్సిటీ పరిశోధకులు జులియానా పారిస్ తన సహచరులతో కలిసి నిర్వహించారు.
ఆరోగ్యానికి...
జర్మనీ ఆహార అధ్యయనం ప్రకారం ప్లేటులో మాంసాహారానికి బదులు తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసాహారాన్ని దూరం పెట్టడం వల్ల పేగులు, పొట్ట ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. గుండెకు కూడా మేలు జరుగుతుంది. ఊబకాయం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటివి కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?
Also read: రెడ్ వైన్ తాగితే బరువు నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా తగ్గాల్సిందే, మధుమేహులకు మరీ మంచిది
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్