By: ABP Desam | Updated at : 06 Dec 2022 11:54 PM (IST)
Edited By: omeprakash
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు
సివిల్స్ మెయిన్-2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్-2 నింపి, యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసంగానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో ఫెసిలిటేషన్ కౌంటర్‌ను లేదా csm-upsc@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఇలా చూసుకోండి..
1. అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- upsc.gov.in
2. upsc.gov.in యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల లింక్ 2020′ పై క్లిక్ చేయండి
3. ఎంచుకున్న అభ్యర్థుల పేరు, రోల్ నంబర్‌తో కూడిన పిడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది.
4. డౌన్‌లోడ్ చేయండి. అవసరమైతే, మరింత సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
Civil Services (Main) Examination, 2022 Results
డీఏఎఫ్-II నింపాల్సిందే..
సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2022 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 (డీఏఎఫ్-II) నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో.. మెయిన్స్ రాత పరీక్షల అనంతరం పర్సనల్ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వీటికి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డీఏఎఫ్-II అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. డీఎఫ్‌లేనిదే ఇంటర్వ్యూకి అనుమతి ఉండదు. డిసెంబరు 8 నుంచి 14 మధ్య డీఏఎఫ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిన్ జూన్ 25న 72 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జూన్ 22న వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుండి 25 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి 300 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.
Also Read:
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!