By: ABP Desam | Updated at : 06 Dec 2022 10:28 PM (IST)
Edited By: omeprakash
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా పోస్టుల వివరాలు వెల్లడించారు.
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీల సంఖ్య: 1147 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
అర్హతలు..
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, 18-44 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
It’s raining jobs in Health Medical & Family Welfare Department!
— Harish Rao Thanneeru (@trsharish) December 6, 2022
Notification for 1,147 vacancies of Assistant Professors under Director of
Medical Education was released by Medical Health Services Recruitment Board#AarogyaTelangana pic.twitter.com/qPshUXtDxT
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!