(Source: ECI | ABP NEWS)
New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్ ఇయర్‌గా 2025
2025 లో టైటిల్ కోసం ఎదురుచూస్తున్న టీమ్స్‌కి అదృష్టం వరించింది. ఈ మాట చెపితే ముందుగా గుర్తు వచ్చేది RCBనే. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్ ప్లేయర్లు.. అన్నీ ఉన్నా కూడా 18 సీజన్లుగా కప్ ను సొంతం చేసుకోలేక పోయింది. ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది.
ఇక ఆ తర్వాత దశాబ్దాల కళను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్స్‌ని గెలిచింది. అంతకన్నా ముందు సఫారీలు ఆడిన 2023 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2023 మెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, 2024 టీ20 మెన్.. విమెన్ వరల్డ్ కప్. 2025 అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో సౌతాఫ్రికా ఓడిపోయింది.
ఇక తాజాగా భారత మహిళా జట్టు 47 ఏళ్ల తర్వాత ODI వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 12 ఐసీసీ టోర్నీల తర్వాత ఎట్టకేలకు 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీని సాధించింది. ఇలా ఈ సంవత్సరం మాత్రం ఎన్నో ఏళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న టీమ్స్ ఛాంపియన్స్ గా నిలిచాయి. కేవలం క్రికెట్ లోనే కాదు. ఇదే సంఘటనలు ఇతర గేమ్స్ లో కూడా జరగడం విశేషం.





















