Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ 'శంబాల'ను ఓన్ చేసుకున్నారని యువ కథానాయకుడు ఆది సాయికుమార్ తెలిపారు. ఇంకా వరుస రిలీజులు, ఫ్లాపుల మీద ఆయన స్పందించారు.

క్రిస్మస్ బరిలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) దిగుతున్నారు. డిసెంబర్ 25న ఆయన హీరోగా నటించిన 'శంబాల' విడుదల అవుతోంది. ఇటీవల పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ విడుదల చేశారు. అందువల్ల, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ 'శంబాల'ను ఓన్ చేసుకున్నారని ఆది సాయికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' వల్ల 'శంబాల' అనేది ప్రేక్షకులు అందరికీ చాలా బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు సినిమా చేరువ కావాలనే ఉద్దేశంతో ముందుగా ట్రైలర్ విడుదల చేశామన్నారు. ఇంకా తన ఫ్లాపులు, సక్సెస్ రేట్ గురించి ఆయన మాట్లాడారు.
'నెక్స్ట్ నువ్వే' వరకు బాగా ఆడాయి...
వరుస రిలీజుల వల్ల పట్టించుకోలేదు!
'నెక్స్ట్ నువ్వే' వరకు తన సినిమాలు బాగా ఆడాయని ఆది సాయికుమార్ చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు విడుదల కావడం వల్ల ప్రేక్షకులు పట్టించుకోలేదని ఆయన వివరించారు. ఇప్పటి నుంచి కథల ఎంపికతో పాటు తన సినిమాల విడుదల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటానని, తన సినిమాలు ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయవని ఆయన చెప్పారు.
'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్' సినిమాను షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి యుగంధర్ ముని దర్శకుడు. అర్చన అయ్యర్, స్వాసిక, రవి వర్మ, మధునందన్, శివ కార్తీక్ ఇతర ప్రధాన తారాగణం. ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
Also Read: ఎవరీ పవన్ కళ్యాణ్? ఏమిటీ పురుషః? భర్త పోరాటం ఎందుకు?
ఆది సాయికుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. అందరినీ మెప్పించే కంటెంట్ ఉన్న సినిమా 'శంబాల'. ట్రైలర్ రెస్పాన్స్ బావుంది'' అని అన్నారు. దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ... ''మా పరమశివుని ఆశీస్సులతో మా 'శంబాల'కు అంతా పాజిటివిటీ ఎదురవుతోంది. టాలీవుడ్ అంతా మాకు సపోర్ట్ చేస్తోంది. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ అద్భుతంగా ఉంటాయి. ఆది గారికి వల్లే నేను కాన్ఫిడెంట్‌గా మూవీ తీశా. అర్చనా గారిది రెగ్యులర్ హీరోయిన్ కారెక్టర్ కాదు. ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది'' అని చెప్పారు. తనకు ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని నటుడు ఇంద్రనీల్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అర్చనా అయ్యర్, నటులు రవి వర్మ, మధునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: ప్రవీణ్ కె బంగారి, కూర్పు: శ్రవణ్ కటికనేని, కళ: జేకే మూర్తి.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?





















