The Girlfriend First Review: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?
Rashmika's The Girlfriend First Review: దీక్షిత్ శెట్టి, రష్మికా మందన్నా జంటగా నటించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

The Girlfriend Movie First Review: నవంబర్ 7న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' థియేటర్లలోకి వస్తోంది. ఇందులో 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదల కావడానికి ముందు ఇండస్ట్రీలో కొంత మందికి సినిమా చూపించారు. ఆల్రెడీ సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారు? అంటే...
రిలేషన్షిప్స్ మీద తీసిన సినిమా!
'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ చూస్తే...కాలేజీ నేపథ్యంలో తీసిన ప్రేమకథగా అర్థం అవుతోంది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య లవ్, బ్రేకప్, ఫ్యామిలీ బాండింగ్ మీద తీశారని అర్థం అవుతోంది. ముఖ్యంగా 'ఇంత క్యారెక్టర్ లెస్ కూతురు' డైలాగ్ వైరల్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ ఎటువంటి కథతో సినిమా తీశాడో అని ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి నెలకొంది. రిలేషన్షిప్స్ మీద రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన బ్రిలియంట్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' అని మూవీ చూసినోళ్లు చెప్పారు.
భూమగా రష్మిక... విక్రమ్‌గా దీక్షిత్!
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో భూమా పాత్రలో రష్మికా మందన్నా నటించారు. విక్రమ్ రోల్ చేశారు దీక్షిత్ శెట్టి. వాళ్లిద్దరూ అద్భుతంగా నటించారని తెలిపారు.
రాహుల్ రవీంద్రన్ సెన్సిబుల్ రైటింగ్ 'ది గర్ల్ ఫ్రెండ్'కు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉన్నాయట. రియాలిటీకి చాలా దగ్గరగా తీసిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' అని చెబుతున్నారు. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను తెరపైకి తీసుకు వచ్చిన దర్శకుడి (రాహుల్ రవీంద్రన్)ని అభినందించాలని మూవీ చూసిన వ్యక్తి చెప్పారు.
Got a chance to watch #TheGirlfriend before everyone else! A brilliant take on relationships. Phenomenal performances by @IamRashmika as Bhuma and @Dheekshiths as Vikram. @23_rahulr’s sensible writing, along with the music and cinematography, are all top-notch ❤️❤️
— Suresh PRO (@SureshPRO_) November 4, 2025
A well-made…
నవంబర్ 7న తెలుగుతో పాటు హిందీలో 'ది గర్ల్ ఫ్రెండ్' విడుదల అవుతోంది. ఈ సినిమాను తమిళం, మలయాళం, కన్నడలో సైతం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ భాషల్లో నవంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించిన చిత్రమిది.
Also Read: మహేష్ - రాజమౌళి సినిమాకు టైటిల్ ఇష్యూ... అదే పేరుతో మరో చిన్న సినిమా





















