Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
వన్ డే ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో భారత మహిళా క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. టీమ్ ఇండియా తరపున ఆడిన తొలి ప్రపంచ కప్‌లోనే కీలక పాత్ర పోషించింది. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. తన బౌలింగ్ ఎటాక్ తో శ్రీ చరణి టాప్ బౌలర్లలో ప్లేస్ సంపాదించుకుంది.
శ్రీచరణి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన అమ్మాయి. 16 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తన మామయ్య కిషోర్‌కుమార్ రెడ్డి సహకారం, ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫాస్ట్ బౌలర్ తన కెరీర్ ను మొదలు పెట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా మారింది.
డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ లీగ్‌లో రెండు మ్యాచ్‌ల్లోనే 4 వికెట్లు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఆలా ప్రపంచ కప్ లో చోటు సంపాదించుకుంది.





















