South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
దక్షిణ ఆఫ్రికా గత రెండేళ్లుగా ఒక భయం ఎదుర్కుంటుంది. అది ఏంటంటే ఆడిన ప్రతి ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ వరకు చేరుకొని ఓటమిపాలవ్వడం. ఆడిన ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో చిన్న చిన్న తప్పుల వల్ల విజేతలుగా నిలవలేక పోతున్నారు. పరుషులు, మహిళలు కలిపి గత రెండేళ్లలో సౌత్ ఆఫ్రికా ఐదుసార్లు ఐసీసీ ఫైనల్స్‌కు చేరుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తప్పా ... మిగతా నాలుగు ఫైనల్స్ లో ఓడిపొయ్యారు. ఇందులో రెండుసార్లు ఓటమి పాలయ్యింది భారత్ చేతిలోనే. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్, జాక్వెస్ కలిస్, ఏబీ డివిలియర్స్ వంటి ప్లేయర్స్ కూడా సౌత్ ఆఫ్రికా ప్రపంచ కప్ కళను నిజం చేయలేక పొయ్యారు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2023 లో అద్భుతమైన ప్రదర్శనతో పైనల్ చేరిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 157 పరుగుల ఛేజింగ్ లో 137 పరుగులు మాత్రమే చేసారు. మెన్ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా భారత్ చేతిలో పరాజయం పాలైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లోనూ దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది.
ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి గదను సొంతం చేసుకుంది. ఇక తాజాగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఇవి కాకుండా మెన్ వన్డే వరల్డ్ కప్ 2023, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దక్షిణాఫ్రికా సెమీస్ నుంచి నిష్క్రమించింది.





















