అన్వేషించండి

Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్

Amberpet Kidnap Case: అంబర్ పేటలో ఓ వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఆ వ్యక్తి మాజీ భార్యే ఈ పని చేసినట్లుగా తేల్చారు.

Police crack kidnapping case of a man in Amberpet: వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడున్నరేళ్ల వరకూ కలసి ఉన్నా..తర్వాత ఉండలేమని విడాకులు తీసుకున్నారు. పెళ్లి సమయంలో అమెరికాలో ఉన్న ఇద్దరూ ఇండియాకు వచ్చేశారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి కిడ్నాపయ్యాడు. చేయించింది మాజీ భార్యేనని పోలీసులు తేల్చి అరెస్టు చేశారు.   

గత 29న శ్యామ్ అనే వ్యక్తి కిడ్నాప్ 

అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 10 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి తెలిపారు.మంత్రి శ్యామ్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆరుగురు నిందితులు శ్యామ్‌ను అపహరించారని పోలీసులు గుర్తించారు. 

డబ్బుల కోసం మాజీ భార్యనే కిడ్నాప్ చేసినట్లుగా గుర్తింపు

వారు రెంట్‌ కార్లలో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.ప్రధాన నిందితురాలు మాధవీలత  అమెరికాలో మంత్రి శ్యామ్‌తో వివాహం చేసుకొని మూడు సంవత్సరాల వ్యవధిలోనే  విడాకులు పొందింది. గత మూడు సంవత్సరాలుగా ఆమె భర్తకు దూరంగా ఉంది. బాధితుడు శ్యామ్‌ తన పేరును ‘అలీ’గా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్‌ తండ్రి నుంచి వచ్చిన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం. అయితే విడాకుల ఒప్పందంలో ఆస్తులు తనకు రావాలని మాజీ భార్య గొడవకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె అలీగా మారిన శ్యామ్ ను కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని నిర్ణయించింది. ప్లాన్ ను అమలు చేసింది.            

మహిళా బౌన్సర్‌తో పాటు రెక్కీ చేసిన మహిళా నిందితులు          

ఈ గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి సాయి అనే వ్యక్తి రామనగర్‌ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. మరో నిందితురాలు జీ.ప్రీతి లేడీ బౌన్సర్‌గా పనిచేస్తుండగా, ఎల్‌.సరిత అనే మరో మహిళ బాధితుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి, అతని కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలింది.                        

బాధితుడు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితుడికి ఫోన్‌ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. శ్యామ్‌ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు తెలియజేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Embed widget