అన్వేషించండి

Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు

Karnataka: కర్ణాటకలో డాక్టర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నా భార్యను నీ కోసం చంపాను అని హంతకుడుఇతర మహిళలకు మెసెజులు పంపినట్లుగా గుర్తించారు.

Karnataka doctor murder case Update:  బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్న డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతికా రెడ్డిని ప్లాన్డ్ గా చంపిన   భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి విషయంలో పోలీసు దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 24న జరిగిన ఈ హత్య తర్వాత వారం వారాల పాటు మహేంద్ర రెడ్డి,  నలుగురు, ఐదుగురు  మహిళలకు "నా భార్యను నీ కోసం చంపాను" అనే  సందేశాలు పంపాడు. వీటిని వాట్సాప్ లో కాకంా..  డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా పంపాడు. 

డాక్టర్ మహేంద్ర రెడ్డి , డాక్టర్ కృతికా ఎం. రెడ్డి ఇద్దరూ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. వీరు 2024 మే 26న వివాహం చేసుకున్నారు. 2025 ఏప్రిల్ 21న, కృతికా మార్తళ్లిలోని  తన తండ్రి ఇంట్లో ఉండగా  అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహేంద్ర ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు, కానీ ఆమె మరణించింది. మొదట ఇది సహజ మరణంగా భావించారు.  కృతికా సోదరి డాక్టర్ నిఖితా రెడ్డి ఆమె కుటుంబం పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేసింది. మహేంద్ర మొదట దానికి వ్యతిరేకించి.. తన భార్యను కోయడం తనకు నచ్చదని నాటకమాడాడు. కానీ పోస్టుమార్టం ఆపలేకపోయాడు.  

పోస్ట్‌మార్టం రిపోర్టులో అసాధారణ విషయాలు బయటపడ్డాయి.   ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) పరీక్షల్లో కృతికా శరీరంలో ఆపరేషన్ థియేటర్‌లో మాత్రమే ఉపయోగించే ఎనస్తీషియా డ్రగ్ ప్రొపోఫాల్ (Propofol) అధిక మోతాదులో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది ఆమె మరణానికి కారణమని పోలీసులు అనుమానించారు. మహేంద్ర తన మెడికల్ జ్ఞానాన్ని ఉపయోగించి ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసి..సహజ మరణంగా చూపించాడని దర్యాప్తులో తేలింది.
 
హత్య తర్వాత మహేంద్ర తన భార్య మరణాన్ని 'లవ్ ప్రూఫ్'గా మార్చి, 4-5 మంది మహిళలను సంప్రదించాడు. ఈ మహిళల్లో కొందరు మెడికల్ ప్రొఫెషనల్స్. వీరిలో ఒకరు మహేంద్ర ముందు ప్రపోజల్‌ను తిరస్కరించిన మహిళ. పోలీసుల ప్రకారం, ఆమె అతన్ని మెసేజింగ్ యాప్‌లలో బ్లాక్ చేసిన తర్వాత, మహేంద్ర PhonePe వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా చిన్న మొత్తాలు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ట్రాన్సాక్షన్ నోట్స్‌లో "I killed my wife for you"   అని రాశాడు.  

ఒక మహిళకు అతను తన మరణం కార్ అక్సిడెంట్‌లో ఫేక్ చేసి తిరిగి వచ్చానని కూడా చెప్పాడు. పోలీసులు మహేంద్ర మొబైల్ ఫోన్ మ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని FSLకు పంపారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ సందేశాలు, డిజిటల్ ట్రయిల్‌ను నిర్ధారించారు  మహేంద్ర సోషల్ మీడియా,  మెసేజింగ్ యాప్‌ల ద్వారా అనేక మహిళలతో ఆన్‌లైన్ రిలేషన్‌షిప్‌లు కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు.  అక్టోబర్ 15న ఉడుపి జిల్లా మణిపాల్‌లో మహేంద్రను అరెస్ట్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget