Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, మూడో మ్యాచ్‌లో భారత్ గెలిచింది. దాంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఇలాంటి టైం లో టీమ్ ఇండియాకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రిలీజ్ చేస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు కుల్దీప్ కు రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ కోసం అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో కుల్దీప్ ఆడనున్నాడు.
కుల్దీప్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లో తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే విదేశీ పిచ్‌లపై కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను మేనేజ్‌మెంట్ సిద్ధం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ టెస్ట్ సిరీస్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే... దక్షిణాఫ్రికాపై స్పిన్‌తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.





















