3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
మన సోలార్ సిస్టంలోకి అనుకోకుండా వచ్చిన ఓ గెస్ట్.. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో పడేసింది. అదే 3ఐ అట్లాస్ ఇంటస్టెల్లర్ కామెట్. దీనికి మన సోలార్ సిస్టంలో పుట్టింది కాదు. అసలు మన సౌర వ్యవస్థతో దీనికి సంబంధమే లేదు. ఎక్కడి నుంచో, వేరే నక్షత్ర వ్యవస్థలో పుట్టి, కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చింది. ఇది చాలా స్పీడ్‌గా సెకనుకు 68 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకోతోందని సైంటిస్టులే చెబుతున్నారు. ఇక దీని ఆర్బిట్ అయితే సైంటిస్టుల ఊహకే అందడం లేదు. దానికి తోడు సాధారణంగా కామెట్స్ ట్రావెల్ చేసేటప్పుడు దాని వెనక ఉండే గాలులు ఓ తోకలాగ ఏర్పడతాయి. అయితే ఆ టెయిల్‌లో కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ 3ఐ అట్లాస్ తోక మాత్రం.. చాలా ఎక్కువగా వెలగిపోతుండటమే కాకుండా.. కార్బన్ డై ఆక్సైడ్‌ని భారీగా విడుదల చేస్తోంది. అంతేకాకుండా.. సాధారణంగా తోకచుక్కల్లో కనిపించని నికెల్ వంటి మెటీరియల్స్ కూడా ఈ అట్లాస్‌పై గుర్తించారు సైంటిస్టులు. దీని స్పీడ్, ట్రాజెక్టరీ, బిహేవియర్ చూస్తుంటే... ఇది కచ్చితంగా కామెట్ అయ్యే ఛాన్స్‌లు లేవని సైంటిస్టులు అంటున్నారు. ఏదో అడ్వాన్స్‌డ్ సివిలైజేషన్ నుంచి మన సోలార్ సిస్టంని విజిట్ చేయడానికి వచ్చిన ఇంటస్టెల్లర్ ఆబ్జెక్ట్ అని దాదాపు తేల్చేశారు.




















