KVS Application: కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ డిప్లొమా/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వయోపరిమితి విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు.
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్ ఆఫీసర్/ఏఈ/లైబ్రేరియన్/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాలు..
➥ 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
1) అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు
2) ప్రిన్సిపాల్: 239 పోస్టులు
3) వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు
5) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు
6) లైబ్రేరియన్: 355 పోస్టులు
7) ప్రైమరీ టీచర్ (మ్యూజిక్): 303 పోస్టులు
8) ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు
9) అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 02 పోస్టులు
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో): 156 పోస్టులు
11) హిందీ ట్రాన్స్‌లేటర్ (హెచ్‌టీ): 11 పోస్టులు
12) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ-యూడీసీ): 322 పోస్టులు
13) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ-ఎల్‌డీసీ): 702 పోస్టులు
14) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు
➥ 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-2599 పోస్టులు, ఓబీసీ-1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్-641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు.
అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). (లేదా) సీనియర్ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనలప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు: రూ.35,400-రూ.1,12,400.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.