అన్వేషించండి

UPSC Result 2025: రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 

UPSC Result 2025: ఒక భయంకరమైన ప్రమాదంలో రెండు కాళ్ళు, ఒక చేయి కోల్పోయినప్పటికీ, సూరజ్ తివారీ తన కథ తానే మార్చుకున్నారు. UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.

UPSC Result 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈసారి, అనేక స్ఫూర్తిదాయకమైన కథలు వెలువడ్డాయి. అలాంటి ఒక పేరు ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నివాసి సూరజ్ తివారీ. సూరజ్ మరోసారి UPSC పరీక్షను క్రాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి, అతను 943 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు.

సూరజ్ తివారీ కథ కేవలం పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం గురించి కాదు, ధైర్యం, కృషి, దృఢ సంకల్పానికి ఉదాహరణ. ఒక భయంకరమైన రైలు ప్రమాదంలో అతను తన రెండు కాళ్ళు, ఒక చేయి, మరో చేతిలో మూడు వేళ్లను కోల్పోయాడు. ఇంత విషాదం తన జీవితంలో చూసిన ఆయన పట్టుదల మాత్రం కోల్పోలేదు. తన కలను వదులుకోవడానికి నిరాకరించి ఆత్మవిశ్వాసంతో సివిల్స్ పరీక్షను క్లియర్ చేశారు. 

మెయిన్‌పురిలోని ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ప్రయాణం

సూరజ్ తివారీ ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని కురవాలి తహసీల్‌లోని ఘర్నాజ్‌పూర్ ప్రాంతానికి చెందినవారు. అతను ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. అతని తండ్రి దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడానికి కురవాలిలో ఒక చిన్న దుకాణం నడిపేవారు.

సూరజ్ తన ప్రాంతంలోని మహర్షి పరశురామ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత 2011లో మెయిన్‌పురిలోని SBRL ఇంటర్ కాలేజీ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యారు. తదుపరి చదువుల కోసం, 2014లో బేవార్‌లోని సంపూర్ణానంద్ ఇంటర్ కాలేజీ నుంచి 12వ తరగతి పూర్తి చేశాచి. సూరజ్ ఎప్పుడూ చదువులో టాపర్‌. భారీ విజయాలు సాధించాలని కలలు కన్నాడు. అయితే, 2017లో, ఒక ప్రమాదం జరిగి ఆయన జీవితం అంధకారంలోకి నెట్టేసింది.  

ఒక రైలు ప్రమాదం అతని జీవితాన్ని మార్చివేసింది.

జనవరి 24, 2017న, సూరజ్ తివారీ ఘాజియాబాద్‌లోని దాద్రి ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో తన రెండు కాళ్లు, ఒక చేయి, మరో చేతిలో రెండు వేళ్లను కోల్పోయారు. ప్రమాదం తర్వాత, సూరజ్ చాలా నెలలు ఆసుపత్రిలో చేరారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా, దాదాపు మూడు నెలలు మంచం పట్టారు. ఈ సమయంలో, కుటుంబం మొత్తం చాలా కష్టాలను ఎదుర్కొంది. సోదరుడు కూడా మరణించాడు. ఈ కష్టాలు, ఒకదాని తర్వాత ఒకటి, ఎవరినైనా కుంగదీసేవే, కానీ వీటికి లొంగిపోయి తన ఆశయాన్ని వదులుకుంటారు కానీ, సూరజ్ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా చదువు కొనసాగించి

ప్రమాదం తర్వాత, సూరజ్ నెమ్మదిగా తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ప్రారంభించారు. 2018లో, ఢిల్లీకి తిరిగి వచ్చి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో చేరారు. అక్కడే తన BAని ప్రారంభించారు. 2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత MAలో చేరారు. ఈ సమయంలో, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. UPSC పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. కానీ సూరజ్ దానిలో ఉత్తీర్ణత సాధించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

ప్రతిరోజూ 15 నుంచి 17 గంటలు కష్టపడి పనిచేయడం

ముందున్న సవాళ్లు చాలా కఠినంగా ఉంటాయని సూరజ్ తివారీకి తెలుసు. అయినప్పటికీ,  పూర్తి శక్తితో సిద్ధం కావడం ప్రారంభించారు. రోజుకు సుమారు 15 నుంచి 17 గంటలు చదివారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఏ ప్రధాన కోచింగ్ సంస్థలపై ఆధారపడలేదు. తన స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఆధారంగా తన ప్రిపరేషన్‌ను కొనసాగించారు. పరీక్ష రోజున, సూరజ్ వీల్‌చైర్‌లో పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పూర్తి విశ్వాసంతో పరీక్షకు హాజరయ్యారు.

రెండోసారి UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

సూరజ్ తివారీ 2022లో తొలిసారిగా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ సమయంలో, అతను 917 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంక్ ఆధారంగా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS)కి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ సర్వీస్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు, సూరజ్ తివారీ మరోసారి UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు, ఈసారి 943వ ర్యాంక్ సాధించాడు.

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget