News
News
వీడియోలు ఆటలు
X

Craft Teachers: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24  పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

* క్రాఫ్ట్ టీచర్: 88 పోస్టులు

➥ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు: 24 పోస్టులు

➥ బీసీ గురుకుల పాఠశాలలు: 60 పోస్టులు

➥ గురుకుల పాఠశాలలలు: 04 పోస్టులు

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఉడ్ వర్క్, టైలరింగ్, బుక్ బైండింగ్, ఎంబ్రాయిడరీ, కార్పెంటర్, సీవింగ్ టెక్నాలజీ, డ్రెస్ మేకింగ్ విభాగాల్లో ట్రేడ్ సర్టిఫికేట్ (ఐటీఐ/టీసీసీ) ఉండాలి. దీనితోపాటు ఏపీ/తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఉండాలి. (లేదా) పాలిటెక్నిక్ డిప్లొమా (ఉడ్ వర్క్, టైలరింగ్, బుక్ బైండింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ)తోపాటు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (లోయర్/హయ్యర్ గ్రేడ్) ఉండాలి. (లేదా) మూడేళ్ల డిప్లొమా (హోంసైన్స్/క్రాఫ్ట్ టెక్నాలజీ) ఉండాలి. (లేదా) బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి రెండేళ్ల కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ/గార్మెంట్ డిజైనింగ్/ఫ్యాషన్ & గార్మెంట్ మేకింగ్ ఒకేషనల్ కోర్సు చేసి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2005 - 02.07.1979 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పేస్కేలు: ఆర్ట్ టీచర్ పోస్టులకు రూ.31,040– రూ.92,050.

రాతపరీక్ష విధానం: మొత్తం 125 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 100 మార్కులు రాతపరీక్షకు, 25 మార్కులు డెమోకు కేటాయిస్తారు. రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్, క్రాఫ్ట్ & క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.  
                                                 
ముఖ్యమైన తేదీలు...

➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.

➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.05.2023.

Notification

Online Application

Website

Also Read:

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!

తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే! 

గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం - అర్హతలివే!

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!

Published at : 25 Apr 2023 04:10 PM (IST) Tags: TS Gurukula Craft Teacher Jobs TS Gurukula Craft Teacher Notification TS Gurukulam Craft Teacher Notification TS Gurukula Craft Teacher Recruitment Craft Teacher Posts

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!