Gurukula DL Notification: గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 868
➥ డిగ్రీ లెక్చరర్స్: 785 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు-55, ఇంగ్లిష్-69, మ్యాథమెటిక్స్-62, స్టాటిస్టిక్స్-58, ఫిజిక్స్-46, కెమిస్ట్రీ-69, బోటనీ-38, జువాలజీ-58, కంప్యూటర్ సైన్స్-99, జియోలజీ-06, బయోకెమిస్ట్రీ-03, బయోటెక్నాలజీ-02, హిస్టరీ-28, ఎకనామిక్స్-25, పొలిటికల్ సైన్స్-27, కామర్స్-93, జర్నలిజం-03, సైకాలజీ-06, మైక్రోబయాలజీ-17, పబ్లిక్ అడ్మిన్‌స్ట్రేషన్-07, సోషియాలజీ-07, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14.
అర్హతలు:
* సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి.
* యూజీసీ/సీఎస్‌ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) లేదా రాష్ట్రాలు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే రాష్ట్రస్థాయి స్లెట్/సెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. అదేవిధంగా 19.09.1991కి ముందు పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు 5 శాతం మార్కులు (55 -50 శాతం) మినహాయింపు వర్తిస్తుంది.
➥ ఫిజికల్ డైరెక్టర్: 39 పోస్టులు
అర్హతలు:
* 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తోపాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) లేదా రాష్ట్రాలు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే రాష్ట్రస్థాయి స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులకు నెట్/సెట్/స్లెట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. అదేవిధంగా 19.09.1991కి ముందు పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు 5 శాతం మార్కులు (55 -50 శాతం) మినహాయింపు వర్తిస్తుంది.
➥ లైబ్రేరియన్: 36 పోస్టులు
అర్హతలు..
* 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్)తోపాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) లేదా రాష్ట్రాలు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే రాష్ట్రస్థాయి స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులకు నెట్/సెట్/స్లెట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. అదేవిధంగా 19.09.1991కి ముందు పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు 5 శాతం మార్కులు (55 -50 శాతం) మినహాయింపు వర్తిస్తుంది.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2005 - 02.07.1979 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పేస్కేలు: రూ.58,850 - రూ.1,37,050.
పరీక్ష విధానం:
మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి వీటిలో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇక డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 120 నిమిషాల సమయం ఉంటుంది.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొఫీషియన్సీ)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పేపర్-2: లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టు నుంచి/ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి/ లైబ్రేరియర్ పోస్టులకు లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ నుంచి -> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.05.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు వారంరోజుల ముందు నుంచి.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.