అన్వేషించండి

Librarian Posts: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!

లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర  నోటిపికేషన్‌ను ఏప్రిల్ 24న విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర  నోటిపికేషన్‌ను ఏప్రిల్ 24న విడుదల చేశారు. దీనిద్వారా 434 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 54 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 180 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

లైబ్రేరియన్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 434

➥ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు: 54 పోస్టులు

➥ బీసీ గురుకుల పాఠశాలలు: 180 పోస్టులు 

➥ మైనార్టీ గురుకులాలలు: 200 పోస్టులు

అర్హత: డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ (బీఎల్‌ఐఎస్సీ) పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1979 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు మాత్రం రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పేస్కేలు: రూ.38,890 - రూ.1,12,510.

రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొపీషియన్సీ) నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-2లో లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 120 నిమిషాల సమయం కేటాయించారు.

                                                   

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.05.2023.

Notification
Online Application

 Also Read:

తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP DesamRR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamTravis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
KTR : ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bharat Gourav Train: విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్, రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్ రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
Telugu TV Movies Today: రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
Embed widget