News
News
వీడియోలు ఆటలు
X

Gurukula JL Notification: గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!

తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 2008

1) జూనియర్ లెక్చరర్స్ (జేఎల్): 1924 పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు-225, హిందీ-20, ఉర్దూ-50, ఇంగ్లిష్-230, మ్యాథమెటిక్స్-324, ఫిజిక్స్-205, కెమిస్ట్రీ-207, బోటనీ-204, జువాలజీ-199, హిస్టరీ-07, ఎకనామిక్స్-82, కామర్స్-87, సివిక్స్-84.  

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో  50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం ఉంటే సరిపోతుంది. పీజీ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టులో బీఈడీ/ బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఉండాలి. మొదడాలజీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి.

2)  ఫిజికల్ డైరెక్టర్: 34 పోస్టులు

అర్హతలు..
➥ 55 శాతం మార్కులతో బీపీఈడీ/ బీపీఈ డిగ్రీ/ బీఎస్సీ (హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్) తోపాటు 55 శాతం మార్కులతో డిగ్రీ (స్పోర్ట్స్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా) 
➥ 50 శాతం మార్కులతో బీపీఈడీ డిగ్రీ/ నాలుగేళ్ల బీపీఈడీ (ఇంటిగ్రేడెట్) ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా)
➥ 55 శాతం మార్కులతో మూడేళ్ల కాలపరిమితితో బీపీఈడీ (లేదా) 50 శాతం మార్కులతో బీపీఈ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. బీపీఈడీ అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, బీపీఈ అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాలి. 
➥ పై అర్హతలతోపాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి రెండేళ్ల ఎంపీఈడీ డిగ్రీ చేసి ఉండాలి.

3) లైబ్రేరియన్: 50 పోస్టులు

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్) తోపాటు కనీసం 50 శాతం మార్కులతో లైబ్రరీ సైన్స్‌లో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2005 - 02.07.1979 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

➦ జూనియర్ లెక్చరర్ పరీక్ష విధానం..
మొత్తం 325 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి వీటిలో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. ఇక డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొఫీషియన్సీ)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పేపర్-2: పెడగోగి (సంబంధిత సబ్జెక్టు) జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొఫీషియన్సీ)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పేపర్-3: అభ్యర్థికి సంబంధించిన సబ్జె్క్టు నుంచి (పీజీ స్థాయి)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.

➦ ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష విధానం..
మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి వీటిలో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇక డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొఫీషియన్సీ)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పేపర్-2: ఫిజికల్ ఎడ్యుకేషన్-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.

➦ లైబ్రేరియన్ పరీక్ష విధానం..
మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి వీటిలో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇక డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ & ఇంగ్లిష్ (బేసిక్ ప్రొఫీషియన్సీ)-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పేపర్-2: లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్-> 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
                               
పేస్కేలు: రూ.58,850 - రూ.1,37,050.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.05.2023.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు వారంరోజుల ముందు నుంచి.

➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

Notification

Online Application 

Website

Also Read:

➥ తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!

➥ తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు

➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు

➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 134 ఆర్ట్ టీచర్ పోస్టులు

➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు

➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు

Published at : 17 Apr 2023 06:51 PM (IST) Tags: TS Gurukulam Recruitment TS Gurukula Notification TS Gurukula Jobs Physical Director Posts Junor Lecturer Posts Librarian in Junior Colleges Junior Colleges Recruitment TS Gurukulam Junior College Posts

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!