PGT Posts: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది.
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో తెలుగు-183, హిందీ-168, ఇంగ్లిష్-189, మ్యాథమెటిక్స్-231, ఫిజికల్ సైన్స్-142, బయోలాజిక్ సైన్స్-161, సోషల్ స్టడీస్-202 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
* పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1276
➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 343
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 57, ఇంగ్లిష్ - 66, మ్యాథమెటిక్స్ - 99, ఫిజికల్ సైన్స్ - 19, బయోలాజికల్ సైన్స్ - 22, సోషల్ స్టడీస్ - 80.
➥ గిరిజన సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 147
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 20, హిందీ - 10, ఇంగ్లిష్ - 24, మ్యాథమెటిక్స్ - 34, ఫిజికల్ సైన్స్ - 19, బయోలాజికల్ సైన్స్ - 21, సోషల్ స్టడీస్ - 19.
➥ బీసీ సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 786
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 106, హిందీ - 158, ఇంగ్లిష్ - 99, మ్యాథమెటిక్స్ - 98, ఫిజికల్ సైన్స్ - 104, బయోలాజికల్ సైన్స్ - 118, సోషల్ స్టడీస్ - 103.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పేస్కేలు: రూ..45,960 - రూ.1,24,150.
ముఖ్యమైన తేదీలు...
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.05.2023.
Also Read:
SJVN: ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌లో 50 ఫీల్డ్ ఇంజినీర్ ఖాళీలు
సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎన్‌జేవీఎన్) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రింట్అవుట్‌ను మే 19 వరకు పంపించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..