అన్వేషించండి

SBI Clerks Notification: ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల, డిగ్రీ అర్హతతో 8773 పోస్టుల భర్తీ

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 8773 ఖాళీలను భర్తీ చేయనుంది.

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 8773 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 8283 రెగ్యులర్ పోస్టులుకాగా.. 490 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.  ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతతు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిగ్రీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

వివరాలు..

➥ క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టులు..

ఖాళీల సంఖ్య: 8773 (రెగ్యులర్-8283, బ్యాక్‌లాగ్-490)

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం:

ప్రిలిమినరీ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2023, నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు (25 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటి-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు (1 గంట)

మెయిన్ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, జనవరిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు(35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు (45 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు (45 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.

పే స్కేలు: Rs.17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920.

బేసిక్‌పే: రూ.19,900. (రూ.17900తోపాటు రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.12.2023.

Notification

Website

ALSO READ:

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌లో 81 టీచింగ్‌ పోస్టులు - ఈ అర్హతలుండాలి

ఆర్జీయూకేటీలో 220 లెక్చరర్‌ పోస్టులు, ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget