అన్వేషించండి

RGUKT Jobs: ఆర్జీయూకేటీలో 220 లెక్చరర్‌ పోస్టులు, ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 220 ఖాళీలను భర్తీచేయనున్నారు.

ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 220 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ రెగ్యులర్ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 20న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, తదితర అంశాల వారీగా స్క్రీనింగ్ పరీక్షకు అర్హుల్ని నిర్ణయించి వారి జాబితాను డిసెంబర్ 12 నాటికి విడుదల చేస్తారు. స్క్రీనింగ్/రాత పరీక్షకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. హాల్టికెట్లు, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూల తేదీలు తదితర వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తారు. 

వివరాలు...

* లెక్చరర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 220.

పోస్టుల కేటాయింపు: ఓసీ-89, బీసీ ఎ-16, బీసీ బి-21, బీసీ సి-03, బీసీ డి-15, బీసీ ఈ-09, ఎస్సీ-33, ఎస్టీ-13, ఈడబ్ల్యూఎస్-21.

సబ్జెక్టులవారీగా ఖాళీలు: బయాలజీ - 08, కెమిస్ట్రీ - 36, డ్యాన్స్ - 04, ఇంగ్లిష్ - 24, ఫైన్ఆర్ట్స్ - 04, ఐటీ - 28, లైబ్రరీ - 08, మ్యాథమెటిక్స్ - 32, మ్యూజిక్ - 04, ఫిజికల్ ఎడ్యుకేషన్ - 12, ఫిజిక్స్ - 36, సైకాలజీ - 04, తెలుగు - 16, యోగా - 04 . ఈ పోస్టులను రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేస్తారు.

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: యూఆర్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 2500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులు కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు) ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది.

జీతం: రూ.57,100 - రూ.1,47,760.

దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:
The Registrar
Rajiv Gandhi University of Knowledge Technologies
I-3 Administrative Building
Nuzvid Campus, Mylavaram Road,
City: Nuzvid
District: Eluru
Andhra Pradesh – Pin Code:521202.

ముఖ్యమైన తేదీలు..

☞ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023. (5 P.M.)

☞ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023. (5 P.M.)

☞ ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి: 30.11.2023.

☞ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023 (5.00 P.M)

☞ తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.

Notification

Online Application

ALSO READ:

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు
చెన్నైలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 66 ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget