అన్వేషించండి

IOB Recruitment: ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 66 ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 66 ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 66

పోస్టుల కేటాయింపు: యూఆర్-30, ఈడబ్ల్యూఎస్-05, ఓబీసీ-18, ఎస్సీ-09, ఎస్టీ-04.

➥ మేనేజర్‌ (లా): 08 పోస్టులు
అర్హత: లా డిగ్రీ. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 27-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: రెండేళ్ల ప్రాక్టీస్ అనుభవం లేదా లా ఆఫీసర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ సీనియర్‌ మేనేజర్‌ (లా): 02 పోస్టులు
అర్హత: లా డిగ్రీ. 
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: రెండేళ్ల ప్రాక్టీస్ అనుభవం లేదా లా ఆఫీసర్‌గా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ మేనేజర్‌(ఐఎస్‌ ఆడిట్‌): 03 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. CISA/ DISA సర్టిఫికేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: IS ఆడిట్ డొమైన్‌లో 2 సంవత్సరాల అనుభవం. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్‌లో హ్యాకింగ్, ఆడిట్/ సెక్యూరిటీ టూల్స్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

➥ సీనియర్‌ మేనేజర్‌(ఐఎస్‌ ఆడిట్‌): 02 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. CISA/ DISA సర్టిఫికేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: IS ఆడిట్ డొమైన్‌లో 4 సంవత్సరాల అనుభవం. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్‌లో హ్యాకింగ్, ఆడిట్/ సెక్యూరిటీ టూల్స్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

➥ మేనేజర్‌ (సెక్యూరిటీ): 03 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: త్రివిధ దళాలలో కమీషన్డ్ సర్వీస్‌తో, కెప్టెన్ ర్యాంక్ హోదాకు తగ్గకుండా కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

➥ చీఫ్‌ మేనేజర్‌ (రిస్క్): 02 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ & ఫుల్ టైం మ్యథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఫుల్ టైం ఎంబీఏ(ఫైనాన్స్‌) లేదా ఎంసీఏ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ క్యాడర్‌లో బ్యాంక్‌లో 8 సంవత్సరాల అనుభవం, ఇందులో రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ మేనేజర్‌ (సివిల్‌): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.

మేనేజర్‌ (ఆర్కిటెక్‌): 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్)తోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి:01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.

➥ మేనేజర్‌(ఎలక్ట్రికల్) : 02 పోస్టులు
అర్హత:  బీఈ/బీటెక్.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (ట్రెజరీ):  02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. పీజీ డిగ్రీ(మేనేజ్‌మెంట్/బిజినెస్/ఫైనాన్స్/బ్యాంకింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (క్రెడిట్‌) : 20 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫైనాన్స్, అకౌంటింగ్). ఎంబీఏ(ఫైనాన్స్), సీఎఫ్‌ఏ/సీఎంఏ/సీఏ/సీబీసీఏ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం. 
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (మార్కెటింగ్‌): 05 పోస్టులు
అర్హత: ఎంబీఏ, పీజీడీబీఎం(మార్కెటింగ్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (హ్యూమన్ రిసోర్సెస్‌): 02 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ(పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్ఆర్/హెచ్ఆర్డీ) లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 4 సంవత్సరాలు.

➥ సీనియర్‌ మేనేజర్‌ (హ్యూమన్ రిసోర్సెస్‌): 01 పోస్టు
అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ(పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్ఆర్/హెచ్ఆర్డీ) లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 7 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌): 02 పోస్టులు
అర్హత:  బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (ఫినాకిల్ కస్టమైజేషన్): 01 పోస్టు
అర్హత:  బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (డీబీ అడ్మిన్/ఓఎస్‌ అడ్మిన్‌): 02 పోస్టులు
అర్హత:  బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (డేటా సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ (టెస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ సర్టిఫికేట్‌): 01 పోస్టు
అర్హత:  బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ (ఐబీ, ఎంబీ, యూపీఐ, ఐఓబీపే) : 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌- డిజిటల్‌ బ్యాంకింగ్‌ (ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

➥ మేనేజర్‌ - డిజిటల్ బ్యాంకింగ్‌ (డెబిట్‌ కార్డ్‌ స్విచ్‌, డీసీఎంఎస్‌): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.

వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ,ఎస్సీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్,  1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పేస్కేలు: రూ.48,170 - రూ.89,890 వరకు ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 06.11.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.11.2023.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget