Prasar Bharati Recruitment: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
Jobs In Akashavani: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రసారభారతి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Akashvani Vijayawada Job Notification: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రసారభారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రాంతీయ వార్తా విభాగంలో క్వాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు పూరించి, నిర్ణీత ఫీజు డిడి రూపంలో చెల్లించాలి. దరఖాస్తుకు డిడిని జతచేసి నిర్ణీత గడువులోగా చేరేలా సంబంధిత చిరునామాకు పంపాలి.
విజయవాడ ప్రాంతంలో నివసించే అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాజువల్ విధానంలో నియామకాలు పొందిన అభ్యర్థులు నెలలో గరిష్టంగా ఆరు రోజుల పనిదినాలు మించకుండా విధుల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తుల విషయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9440674057 ఫోన్ నెంబరులో పనిదినాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు.
వివరాలు..
* ఆకాశవాణిలో ఉద్యోగాలు
1) క్వాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలగు)
2) క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ (తెలగు)
3) క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్
అర్హతలు..
క్వాజువల్ న్యూస్ ఎడిటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జర్నలిజంలో డిగ్రీ లేదా పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా రిపోర్టింగ్/ఎడిటింగ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం ఉండాలి. తెలుగు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రసారానికి అనుగుణంగా వాయిస్ (స్వరం)తోపాటు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం ఉండాలి. తెలుగు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు రేడియో ప్రొడక్షన్‌లో ప్రొఫెషనల్ డిప్లొమాతోపాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 28.11.2023 నాటికి 21 - 50 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.354. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.266 చెల్లించాలి. అభ్యర్థులు 'Prasar Bharati, Akashvani, Vijayawada' పేరుతో డిడి తీయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో. దరఖాస్తుకు నిర్ణీత ఫీజుతో డిడి తీసి, గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. నేరుగా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపే కవరు పైభాగంలో 'Application for RNU' అని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, అర్హతలు, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Head of Office
Akashvani, Punnamathota,
M.G. Road, Vijayawada - 520010.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 28.11.2023.
ALSO READ:
సికింద్రాబాద్‌లో 'అగ్నివీర్' సైనిక నియామక ర్యాలీ, షెడ్యూలు ఇదే!
కేంద్ర ఆరోగ్యశాఖలో 487 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం