SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.85,500 వరకు వేతనం.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు
SSC Phase 9 Selection Post 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3,261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇవే..
ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ గడువు అక్టోబర్ 25వ తేదీతో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11.30 వరకు గడువు ఉంది. బ్యాంక్ ద్వారా చలాన్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1 వరకు అవకాశం ఉన్నట్లు ఎస్ఎస్‌సీ తన నోటిఫికేషన్లో తెలిపింది.
రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: డీఆర్డీఓ హైదరాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
జోన్ల వారీగా ఖాళీల వివరాలు..
జోన్ | ఖాళీల సంఖ్య |
ఎస్‌ఎస్‌సీ ఎన్ఆర్ రీజియన్ | 1159 |
ఎస్‌ఎస్‌సీ ఈఆర్ రీజియన్ | 800 |
ఎస్‌ఎస్‌సీ ఎన్‌డబ్ల్యూఆర్ రీజియన్ | 618 |
ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూఆర్ రీజియన్ | 271 |
ఎస్‌ఎస్‌సీ ఎస్ఆర్ రీజియన్ | 159 |
ఎస్‌ఎస్‌సీ ఎంపీఆర్ రీజియన్ | 137 |
ఎస్‌ఎస్‌సీ కేకేఆర్ రీజియన్ | 117 |
Also Read: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..
పోస్టులు, విద్యార్హత, వయోపరిమితి..
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, మెడికల్ అటెండెంట్, టెక్నీషియన్, టెక్స్‌టైల్ డిజైనర్, ల్యాబొరేటరీ అటెండెంట్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి వివరాలు మారుతున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు) ఉంటాయి.
Also Read: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్స్.. బీటెక్ వారికి మంచి ఛాన్స్..
Also Read: టెన్త్ విద్యార్హతతో రైల్వేలో 2226 జాబ్స్ .. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి