FSSAI Recruitment 2021: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 254 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఆహార నాణ్యతా ప్రమాణాలను కొలిచే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 254 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ కేడర్‌లో 21 పోస్టులు.. గ్రూప్ బీ, గ్రూప్ సీ కేడర్‌లో 233 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు నవంబర్ 7వ తేదీతో ముగియనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్టు ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500.. జనరల్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.inను సంప్రదించవచ్చు.
Also Read: టెన్త్ విద్యార్హతతో రైల్వేలో 2226 జాబ్స్ .. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
వేతనం వివరాలు..
గ్రూప్ ఏ పోస్టులకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది. గ్రూప్ బీ పోస్టులకు ఎంపికైన వారికి నెలవారీగా రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు వేతనం చెల్లిస్తారు. గ్రూప్ సీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు వేతనం అందిస్తారు.
విద్యార్హత, వయోపరిమితి..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కాలేజీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఈ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీలు..
విభాగం | పోస్టుల సంఖ్య |
టెక్నికల్ ఆఫీసర్ | 125 |
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ | 37 |
ప్రిన్సిపల్ మేనేజర్ | 1 |
అసిస్టెంట్ డైరెక్టర్ | 15 |
డిప్యూటీ మేనేజర్ | 6 |
ఫుడ్ అనలిస్ట్ | 4 |
అసిస్టెంట్ మేనేజర్ (IT) | 4 |
అసిస్టెంట్ మేనేజర్ | 4 |
అసిస్టెంట్ | 33 |
హిందీ ట్రాన్స్‌లేటర్ | 1 |
పర్సనల్ అసిస్టెంట్ | 19 |
IT అసిస్టెంట్ | 3 |
గ్రేడ్-1 జూనియర్ అసిస్టెంట్ | 3 |
Also Read: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్స్.. బీటెక్ వారికి మంచి ఛాన్స్..
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..