IBPS Clerk XI 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే..
ఐబీపీఎస్ (IBPS) దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. వీటిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల అధికారిక నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల చేసింది. ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలను నిర్వహించాలనే డిమాండ్లు రావడంతో దరఖాస్తు ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. జూన్ నెలలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 5830 క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి. అయితే తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పోస్టులను పెంచుతున్నట్లు తెలిపింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణలో 333 పోస్టులు (మొత్తం 720) ఉన్నాయి. ఐబీపీఎస్ క్లర్క్ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 27వ తేదీతో ముగియనుంది. ఈసారి ఇంగ్లిష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. ఏపీ అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష రాయవచ్చు. ఇక తెలంగాణ అభ్యర్థులు.. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషలలో పరీక్ష రాసే వెసులుబాటు కల్పించింది. పరీక్ష విధానం సహా మరిన్ని వివరాల కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్ https://www.ibps.in/ ను సంప్రదించవచ్చు.
Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..
విద్యార్హత, వయోపరిమితి..
ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కాలేజీ నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. అభ్యర్థులు ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేస్తున్నారో ఈ ప్రాంతానికి చెందిన అధికార భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
Also Read: ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. రూ.1.05 లక్షల వరకు జీతం.. ఇలా అప్లయ్ చేసుకోండి..
బ్యాంకు | ఖాళీల సంఖ్య |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 205 |
ఇండియన్ బ్యాంక్ | 60 |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 34 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 16 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 10 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 5 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 2 |
కెనరా బ్యాంక్ | 1 |
ఏపీలో ఖాళీల వివరాలు..
బ్యాంకు | ఖాళీల సంఖ్య |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
248 |
ఇండియన్ బ్యాంక్ | 120 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 9 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 4 |
కెనరా బ్యాంక్ | 3 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 3 |
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..