By: ABP Desam | Updated at : 06 Oct 2021 05:22 PM (IST)
Edited By: sharmiladevir
ప్రతీకాత్మక చిత్రం
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్- XI (IBPS CRP-XI) దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 7) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలైలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లు వెలువెత్తిన నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఐబీపీఎస్‌ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది.
తాజాగా ఈ భర్తీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. అంతకుముందు క్లర్క్ నోటిఫికేషన్ విడుదలైన సమయంలో అంటే జూలై 12 నుంచి 14వ తేదీల మధ్య రిజిస్టర్ చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలు ఉన్నాయి.
Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..
13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష..
ఐబీసీఎస్ నోటిఫికేషన్ ద్వారా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈసారి ఇంగ్లిష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు (ప్రిలిమ్స్, మెయిన్స్) నిర్వహించనున్నట్లు పేర్కొంది. వీటిలో తెలుగు కూడా ఉండనుంది. డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఐబీపీఎస్ వెబ్‌సైట్ https://www.ibps.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
ఏయే బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయంటే?
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్, ఇండియన్ బ్యాంకుల్లోని క్లర్క్ పోస్టులనుకి ఐబీపీఎస్ భర్తీ చేయనుంది.
ముఖ్యమైన తేదీలివే..
ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2021 | జూలై 11, 2021 |
ఐబీపీఎస్ క్లర్క్ అప్లికేషన్ ఫామ్ 2021 ప్రారంభం (రీఓపెనింగ్ విండ్) | 2021 అక్టోబర్ 7 |
దరఖాస్తు చివరి తేదీ | 2021 అక్టోబర్ 27 |
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ విడుదల | 2021 నవంబర్ |
ప్రీ ట్రైనింగ్ | 2021 నవంబర్ |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్ పరీక్షకు అడ్మిట్ కార్డుల విడుదల | 2021 నవంబర్ / డిసెంబర్ |
ప్రిలిమ్స్ ఎగ్జామ్ | 2021 డిసెంబర్ |
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు | 2021 డిసెంబర్ / 2022 జనవరి |
మెయిన్స్ కాల్ లెటర్ల డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభం | 2021 డిసెంబర్ / 2022 జనవరి |
ఐబీపీఎస్ మెయిన్ ఎగ్జామ్ | జనవరి / ఫిబ్రవరి 2022 |
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ | 2022 ఏప్రిల్ |
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం