(Source: ECI/ABP News/ABP Majha)
IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గడువు అక్టోబర్ 14తో ముగియనుంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్- IBPS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రీసెర్చ్, టీచింగ్, ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ అసోసియేట్స్, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్స్, ఐటీ ఇంజనీర్స్, హిందీ ఆఫీసర్, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టి నుంచి (అక్టోబర్ 1) ప్రారంభం కానుంది. దరఖాస్తు గడువు అక్టోబర్ 14తో ముగియనుంది. దరఖాస్తు ప్రక్రియకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. పూర్తి వివరాల కోసం ibps.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఐబీపీఎస్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..
ఎంపిక విధానం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు గ్రూప్ ఎక్సర్‌సైజెస్, ప్రజెంటేషన్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామ్, ఐటెమ్ రైటింగ్ ఎక్సర్‌సైజ్, గ్రూప్ ఎక్సర్‌సైజెస్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
హిందీ ఆఫీసర్ పోస్టుకు ఆన్‌లైన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఐటెం రైటింగ్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఐటీ ఇంజనీర్, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ టెస్టర్ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..
విద్యార్హత, వయోపరిమితి..
పోస్టును బట్టి వయోపరిమితి, విద్యార్హతలో తేడాలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. మెజారిటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించారు. దీంతో పాటుగా సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ను ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో CLICK HERE TO APPLY ONLINE ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3. CLICK HERE FOR NEW REGISTRATION ఆప్షన్ ఎంచుకోవాలి.
4. అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
5. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
6. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
7. ఫొటో, సంతకం, ఫింగర్ ప్రింట్, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.
8. దరఖాస్తు ఫీజు చెల్లించడంతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..