(Source: ECI/ABP News/ABP Majha)
SBI PO Recruitment 2021: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
SBI PO Jobs: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) శుభవార్త అందించింది. ఎస్‌బీఐలో 2056 పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 25తో ముగియనుంది.
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) గుడ్ న్యూస్ అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 2056 ప్రొబెషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 2,000 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన.. మిగతా 56 పోస్టులను బ్యాక్‌లాగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి (అక్టోబర్ 5) నుంచి ప్రారంభం కానుండగా.. గడువు అక్టోబర్ 25తో ముగియనుంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది.
అర్హులకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ (Pre Examination Training) సదుపాయం కూడా కల్పించింది. నవంబర్ మధ్య వారంలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పోస్టుల ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆన్‌లైన్) డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.750 ఫీజు చెల్లించాలి.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
ఈ పోస్టులకు ఎంపికైన వారు.. ఉద్యోగంలో చేరే సమయంలో బ్యాంకులో కనీసం మూడేళ్ల పాటు సేవలు అందిస్తామని పేర్కొంటూ.. రూ.2 లక్షల బాండ్ (Bond) ఇవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విద్యార్హత, వయోపరిమితి..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతోన్న వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. 2020 డిసెంబర్ 31లోగా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. 2020 ఏప్రిల్ 4 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు అందించారు.
ముఖ్యమైన తేదీలు..
ప్రిలిమినరీ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ | నవంబర్ 2021 |
ప్రిలిమనరీ ఎగ్జామ్ | డిసెంబర్ 2021 మొదటి వారంలో |
మెయిన్ పరీక్ష | డిసెంబర్ 2021 చివరి వారంలో |
ఇంటర్వ్యూ ప్రక్రియ | ఫిబ్రవరి 2022 |
తుది ఫలితాలు | ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి (2022) |
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..
రిజర్వేషన్ల వారీగా ఖాళీలు..
రెగ్యులర్ ఖాళీలు (2000): జనరల్- 810, ఓబీసీ- 540, ఎస్సీ- 300, ఈడబ్ల్యూఎస్ - 200, ఎస్టీ- 150
బ్యాక్‌లాగ్ ఖాళీలు (56): ఓబీసీ- 20, ఎస్సీ- 24, ఎస్టీ- 12
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, చీరాల, ఏలూరు, కడప, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు.. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
Also Read: టెన్త్ విద్యార్హతతో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..