News
News
X

SSC Recruitment 2021: టెన్త్ విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. టెన్త్, ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో 1,775 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు గడువు అక్టోబ‌ర్ 25తో ముగుస్తుంది.

FOLLOW US: 
 
నిరుద్యోగులకు స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,775 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు గడువు అక్టోబ‌ర్ 28 రాత్రి 11.30 వ‌ర‌కు ఉంది. బ్యాంక్ చ‌లాన్ రూపంలో ఫీజు చెల్లించేందుకు న‌వంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు గడువు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాత ప‌రీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన రాత ప‌రీక్ష వచ్చే ఏడాది జ‌న‌వ‌రి ఫిబ్ర‌వరి నెలలో జ‌రిగే అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌య్యాక ప‌రీక్ష తేదీలను విడుద‌ల చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.inను సంప్రదించవచ్చు. 

Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..

వయోపరిమితి, విద్యార్హత.. 
పోస్టుల ఆధారంగా వయోపరిమితి, విద్యార్హత వివరాలు మారుతున్నాయి. కొన్ని పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత అవసరం. మరికొన్నింటికి 12వ తరగతి (ఇంటర్) విద్యార్హత ఉండాలి. గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో కూడా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ (దివ్యాంగ), ఎక్స్ సర్వీస్‌మెన్ (ఈఎస్ఎం) కేట‌గిరీల అభ్య‌ర్థులు, మ‌హిళ‌లకు ఎలాంటి ప‌రీక్ష ఫీజు లేదు. మిగతా వారు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

అభ్యర్థుల ఎంపిక విధానం..
అభ్యర్థులకు మొదట కంప్యూట‌ర్ బెస్డ్ (CBT) ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.  ఈ ప‌రీక్ష వ్యవధి 60 నిమిషాలుగా ఉంది. ఆబ్జెక్టివ్ విధానంలో (Objective type) ప్ర‌శ్న‌లు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తీ త‌ప్పు ప్ర‌శ్న‌కు 0.50 (1/2) మార్కుల కోత విధిస్తారు. అయితే పోస్టు, విద్యార్హ‌త‌ ఆధారంగా 3 ప‌రీక్ష‌ల వ‌ర‌కు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. రాత ప‌రీక్షలో క్వాలిఫై అయిన వారికి నైపుణ్య (Skill) పరీక్ష ఉంటుంది. 

News Reels

Also Read: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

పరీక్ష విధానం..

స‌బ్జెక్టు  ప్ర‌శ్న‌లు మార్కులు
జ‌న‌ర‌ల్ ఇంటెలిజ‌న్స్ 25 50
జ‌న‌రల్ అవేర్‌నెస్ 25 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 50

Also Read: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Also Read: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 03 Oct 2021 06:49 PM (IST) Tags: SSC Jobs SSC Recruitment 2021 SSC Recruitment 1775 Jobs

సంబంధిత కథనాలు

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !