అన్వేషించండి

CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిసెంబర్ 2021 నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈసారి పరీక్షను ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.

ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్- సీటెట్) నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సీటెట్ ప‌రీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. సీటెట్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 19వ తేదీతో ముగియనుందని తెలిపింది. దరఖాస్తు ఫీజులను అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చని అభ్యర్థులకు సూచించింది. సీటెట్ పరీక్షలను డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సీటెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. బీఈడీ పూర్తి చేసిన వారు సీటెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు వివరాలు.. 
ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, ఓబీసీ  అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు అయితే రూ.1200 ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.500.. రెండు పేపర్‌లకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్, అర్హత, దరఖాస్తు రుసుము తదితర సమగ్ర సమాచారాన్ని ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సీటెట్ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

సీటెట్ పరీక్ష కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
1. సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.inను ఓపెన్ చేయండి.
2. ఇక్కడ ‘Apply Online for CTET December 2021’ అనే లింక్ పై క్లిక్ చేయండి. 
3. ఇక్కడ అభ్యర్థులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో రిజిస్ట‌ర్ నంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. దీనిని సేవ్ చేసుకోవాలి. 
4. దరఖాస్తును పూర్తి చేయాక.. నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. 
5. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 
6. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోవాలి. 

CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

పరీక్ష విధానం.. 
సీటెట్ (Central Teacher Eligibility Test) రాత పరీక్ష డిసెంబర్‌ 16 నుంచి జనవరి 13 వరకు జరగనుంది. రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్‌.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్‌ ఉంటుంది. దీనిలో 2 పేపర్లు ఉంటాయి. 1 నుంచి 6వ తరగతి వరకు పేపర్‌-1.. 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2 ఉంటాయి.

పేపర్‌-1 పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లో 5 సెషన్లు ఉంటాయి. ఒక్కో సెషనుకు 30 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు కేటాయించారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ & పెడగాగి, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ అనే ఐదు సెషన్లు ఉంటాయి. 

పేపర్‌-2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ & పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్ & సైన్స్‌‌ లేదా సోషల్‌ సైన్స్‌ / సోషల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి 3 సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున 90 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 2 సెక్షన్లకు 60 మార్కులు కేటాయించారు. 

8 ప్రాంతాల్లో సీటెట్‌ పరీక్ష కేంద్రాలు..
సీటెట్‌ పరీక్షను తెలంగాణ 8 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. గతేడాది వరకు కేవలం హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ సెంటర్లు ఉండేవి. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, కోదాడ, నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 

Also Read: ATOS Recruitment: భారత్‌లో 15000 నియామకాలు.. నిరుద్యోగులకు 'అటోస్' గుడ్ న్యూస్

Also Read: Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget