News
News
వీడియోలు ఆటలు
X

IOCL Recruitment 2021: ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. రూ.1.05 లక్షల వరకు జీతం.. ఇలా అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 535 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000 వరకు వేతనం అందించ‌నుంది.

FOLLOW US: 
Share:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 535 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భ‌ర్తీ చేయనుంది. ఎంపికైన వారికి రూ.50,000 నుంచి రూ.1,05,000 వరకు నెలవారీ వేతనం అందించ‌నుంది. డిప్లొమా, డిగ్రీ విద్యార్హత గలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి.. నోటిఫికేషన్లో పేర్కొన్న డాక్యుమెంట్లతో (ఆఫ్‌లైన్‌ విధానం) కలిపి పోస్టు చేయాలి. వేర్వేరు రిఫైనరీలకు విభిన్న చిరునామాలు అందించింది. ఆఫ్‌లైన్‌ విధానం దరఖాస్తులను అక్టోబర్ 23లోగా పంపాలి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష అక్టోబర్ 24న నిర్వహిస్తారు. ఫలితాలను నవంబర్ 11వ తేదీన విడుదల చేస్తారు. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..

విభాగాల వారీగా ఖాళీలు..

విభాగం  ఖాళీల సంఖ్య 
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (Production) 296
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఎలక్ట్రికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 65
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 64
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (P & U)  35
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ IV 29
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (మెకానికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 27
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఫైర్ అండ్ సేఫ్టీ) 14
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 4
జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ IV 1

Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
1. ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/latest-job-opening ను ఓపెన్ చేయండి.
2. నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్‌లో (Non-Executive Personnel) Click here to Apply Online పైన క్లిక్ చేయండి.
3. మీరు అప్లయ్ చేయాలనుకున్న పోస్టును ఎంచుకున్నాక.. Proceed పైన క్లిక్ చేయాలి.
4. మీరు ఏ రిఫైనరీలో (Refinery) ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో దానిని ఎంచుకుని.. Proceed పై క్లిక్ చేయాలి.
5. అభ్యర్థులు తమ పేరు, డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హత తదితర వివరాలను ఇవ్వాలి. 
6. దరఖాస్తు రుసుం చెల్లించి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. 
7. దరఖాస్తు ఫామ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి. 
8. అప్లికేషన్ ఫామ్‌పైన సంతకం చేసి, ఫోటో అతికించి, జిరాక్స్ కాపీస్ జత చేసి పోస్టులో పంపాలి.

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 07 Oct 2021 02:39 PM (IST) Tags: IOCL Recruitment 2021 IOCL Recruitment 535 Junior Engineering Assistant IOCL Jobs IOCL

సంబంధిత కథనాలు

TSLPRB Result: పోలీసు అభ్యర్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడి!

TSLPRB Result: పోలీసు అభ్యర్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడి!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?