అన్వేషించండి

SSC Constable Admitcard: కానిస్టేబుల్ పోస్టుల అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన రాతపరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) జనవరి 7న విడుదల చేసింది.

SSC GD Constable Recruitment Exam City: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) జనవరి 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి నార్త్-వెస్టర్న్ రీజియన్‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డులు మాత్రమే విడుదలయ్యాయి. ఇతర రీజియన్లకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు ఆయా రీజియన్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షక సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

నార్త్-వెస్టర్న్ రీజియన్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

సదరన్ రీజియన్  అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

సదరన్ రీజియన్ అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 26,146

పోస్టుల కేటాయింపు: యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 మెన్-5211, ఉమెన్-963
సీఐఎస్‌ఎఫ్‌ 11025 మెన్-9913, ఉమెన్-1112
సీఆర్‌పీఎఫ్‌ 3337 మెన్-3266, ఉమెన్-71
ఎస్‌ఎస్‌బీ 635 మెన్-593, ఉమెన్-42
ఐటీబీపీ 3189 మెన్-2694, ఉమెన్-495
ఏఆర్ 1490 మెన్-1448, ఉమెన్-42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 మెన్-222, ఉమెన్-74
మొత్తం ఖాళీలు 26,146 26,146

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget