(Source: ECI/ABP News/ABP Majha)
CCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఖాళీలు.. పూర్తి వివరాలివే..
సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL) వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌నువిడుదల చేసింది.
సీసీఎల్ వివిధ ట్రేడ్ లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org ద్వారా పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05 డిసెంబర్ 2021గా నిర్ణయించారు.
సీసీఎల్ రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీల వివరాలు
ఒక సంవత్సరం శిక్షణ కోసం ఎలక్ట్రీషియన్, COPA, ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, సిర్దార్, కార్పెంటర్, గార్డనర్, పెయింటర్ తోపాటు ఇతర ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ల పోస్టుల కోసం మొత్తం 539 ఖాళీలు ఉన్నాయి.
Trades | No. of Posts |
Electrician | 190 |
Fitter | 150 |
Mechanic Repair & Maintenance of Vehicle | 50 |
COPA | 20 |
Machinist | 10 |
Turner | 10 |
Electronics Mechanics | 10 |
Plumber | 07 |
Photographer | 03 |
Florist & Landscaper | 05 |
Book Binder | 02 |
Carpenter | 02 |
Dental Laboratory Technician | 02 |
Food Production | 01 |
Furniture & Cabinet Maker | 02 |
Gardener (Mali) | 10 |
Horticulture Assistant | 05 |
Old Age Care Taker | 02 |
Painter (General) | 02 |
Receptionist/Hotel Clerk/Front Office Assistant | 02 |
Steward | 06 |
Tailor | 02 |
Upholsterer | 01 |
Secretarial Assistant | 05 |
Sirdar | 10 |
Accountant/Accounts Executive | 30 |
Total | 539 |
అర్హత ప్రమాణాలు
1. సీసీఎల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
2. సిర్ధార్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
3. అభ్యర్థులంతా సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉత్తిర్ణత సాధించి ఉండాలి.
4. నవంబర్ 20 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైఫండ్ ఎంతంటే?
సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుకు ఎంపికైన వారికి ప్రతీ నెలా రూ. 7000 స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటీస్ వ్యవధిలో ఎటువంటి అలెవెన్సులు ఇవ్వరు. అభ్యర్థులు కేవలం సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లై చేయండిలా...
అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేయాలి. అభ్యర్థులు apprenticeshipindia.org వెబ్ సైట్లో రిజిస్టర్ అయి.. దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Also Read: Nizamabad: వివాదాస్పదంగా మారిన టీయూ సౌత్ క్యాంపస్ నియామకాలు.. విద్యార్థి సెల్ఫీ వీడియో వైరల్
Also Read: SSC CGL Tier 1 Results: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి