(Source: ECI/ABP News/ABP Majha)
Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఉద్యోగం కోల్పోవడం అనేది మనసుకే కాదు ఆర్థికంగానూ కష్టం. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగం పోతే.. భయాందోళన చెందడం సాధారణం. కానీ దానిని ఎలా అధిగమించాలి.
ఉద్యోగం పోయే రోజు.. మీ బాస్ లేదా హెచ్ ఆర్ వాళ్లు మిమ్మల్ని పిలుస్తారు. సారీ.. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నాం. సెటిల్ చేస్తాం. మీరు రిజైన్ చేసి వెళ్లిపోవాలి. ఈ మాటలు చెప్పాగానే.. ఒక్కసారిగా ఏం అర్థంకాదు. ఆ తర్వాత మానసికంగా కుంగిపోతాం. ముందు ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. పిల్లల చదువులు, నెలవారీ ఖర్చులు.., అప్పటికే తీసుకున్న లోన్స్, నెల నెల కట్టే ఈఎంఐలు.. అమ్మ బాబోయ్.. ఏమీ అర్థం కాని పరిస్థితి. అందుకే ఏదైనా కారణంతో ఉద్యోగం పోయినా.. జీతంలో కోతలు పడినా.. చాలా తెలివిగా వ్యవహరించాలి. ఒత్తిడితో సరైన నిర్ణయాలు తీసుకోలేం.. కానీ ఆ టైమ్ లో తీసుకునే నిర్ణయాలే.. మనకు చాలా విలువైనవి. త్వరగా ఉద్యోగం కోసం వెతుక్కోవడం.. లేదా సరైన ఆర్థిక నిర్వహణ ఇవే.. మిమ్మల్ని కాపాడేవి..
మీ ఖర్చును తగ్గించండి
ఉద్యోగం చేసేప్పుడు లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది. లాక్ డౌన్ కి ముందు.. లాక్ డౌన్ తర్వాత ఎలా ఉందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. మనం అనుకుంటాం... బతకడం చాలా ఖరీదైనదని. కానీ లాక్ డౌన్ లో ఎంత వరకూ ఖర్చులు తగ్గాయో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఉద్యోగం పోవడం లేదా పే కట్ ఉండటం లాంటివి మీ జీవితంలో జరిగితే.. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట తినడం, ప్రయాణాలు చేయడం, వెకెషన్స్ కి వెళ్లడం లాంటివి చేస్తే.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు కల్లాస్. ఖర్చు, అలవాట్లను మార్చుకోవాలి. ఉద్యోగం పేరుతో సిటీలో ఉంటాం. ఒకవేళ అనుకూలిస్తే.. తక్కువ ఖర్చులతో జీవించే ప్రదేశానికి వెళ్తే చాలా మంచిది.. ఒకవేళ మీ నెలవారీ చెల్లింపులో ఎక్కువ భాగం అద్దె.., ఇతర అనవసరమైన ఖర్చులకే పోతే.. మరడమే మంచిది.
కొత్త రుణాలు తీసుకోవడం ఆపేయండి
చేతిలో డబ్బు లేదు కదా అని కొత్త రుణం తీసుకోవడానికి అసలు ప్రయత్నించొద్దు. ఇది భవిష్యత్ లో చాలా ప్రమాదకరం. మీరు గతంలో తీసుకున్న రుణాలు ఉండి ఉంటే.. కొత్తగా తీసుకునేది.. ఇంకా అదనపు భారం. ఎందుకంటే.. అది కూడా ఈఎంఐల రూపంలో చెల్లించాలి. మీకు డబ్బులు చాలా అవసరం ఉన్నప్పుడు... ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి కూడా తీసుకోవచ్చు. కరోనా నుంచి ఇందులో సడలింపు ఇచ్చారు. మీ EPF ఖాతా నుంచి మీ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకూ తీసుకొవచ్చు.
ఇతర ఆదాయాల కోసం చూడండి
వేతనాల కోత లేదా ఉద్యోగ నష్టం కారణంగా మీరు అవసరాలను తీర్చుకోవడానికి కష్టాపడాల్సి వస్తుంది. మీకున్న నైపుణ్యాలు, అభిరుచులతో డబ్బు సంపాదించేందుకు దారి ఉందేమో ఆలోచించండి. మీ జీవిత భాగస్వామిని కూడా సహకారం అందించమనండి. ఖర్చులకు ఉపయోగపడతాయి.
ఈ సమయంలో నెలవారీ పెట్టుబడులు.. మీకు సవాలుగా అనిపించవచ్చు. స్వల్పకాలిక లక్ష్యాలు ఎక్కువ ఖర్చులను కలిగి ఉంటే.. వాటిని తాత్కలికంగా వాయిదా వేసుకోండి. జీతం కట్‌తో ఎలాంటి సమస్యలు లేకుండా.. ఇంటి బాధ్యతలు తీరిపోతాయంటే.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే ఉంటే దానిని పెంచండి.
Also Read: Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త
Also Read: Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..