News
News
X

Nizamabad: వివాదాస్పదంగా మారిన టీయూ సౌత్ క్యాంపస్ నియామకాలు.. విద్యార్థి సెల్ఫీ వీడియో వైరల్

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో అక్రమ నియామకాలు, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు ఇచ్చారంటూ విద్యార్థి ఆరోపించాడు. నియామకాలు రద్దు చేయాలని హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదు.

FOLLOW US: 

తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాల బాగోతం పూర్తిగా సద్దుమనగక ముందే తాజాగా సౌత్ క్యాంపస్ లో అక్రమ నియామకాల అంశం వివాదాస్పదంగా మారింది. అక్రమంగా టీచింగ్ నియామకాలు చేపట్టారని యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి గణేష్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. సౌత్ క్యాంపస్‌లో అక్రమ నియామకాలు జరిగాయంటూ వీడియో ద్వారా ఆరోపించాడు. పార్ట్ టైం టీచింగ్ నియామకం ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో 2019 ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆరుగురు దరఖాస్తు చేస్తుకున్నారు.

సౌత్ క్యాంపస్ లోనే పార్ట్ టైంలో 2 ఏళ్లుగా టీచింగ్ చేసిన తనతోపాటు మరోక ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ దేవయ్యకు ఇంటర్వూ ఉన్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదని గణేెష్ పేర్కొన్నాడు. అప్పటి వీసీ సాంబయ్య తనకు నచ్చిన వ్యక్తులకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారని గణేష్ ఆరోపించారు. ఈ నియామకాలను పార్ట్ టైం టీచర్లుగా నియమించారు. కానీ వారిని కాంట్రాక్ట్ ప్రోఫెసర్లుగా అప్పటి వీసీ సాంబయ్య పి, సరిత, దిలీప్, శ్రీమాతను నియించారని తెలిపారు గణేష్.
Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

నియామకాలకు వ్యతిరేకంగా హైకోర్టుకెళ్లిన గణేష్

ఈ నియామకానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు గణేష్ తెలిపాడు. వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు కూడా పంపినట్లు వెల్లడించాడు. కానీ వారు ఆ నోటీసులకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని.. యూనివర్సిటీ అక్రమ నియామకాలు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తే అక్టోబర్ 31న ఈసీ పాలక మండలి సమావేశంలో ఈ నియామకాలు రద్దు చేశారని గుర్తుచేశాడు.

వీసీ, రిజీస్ట్రార్లు కలిసి పి. సరిత, దిలీప్, శ్రీమాతను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కొనసాగమని చెప్పడం, బడ్జెట్ కేటాయించడం సిగ్గుచేటని గణేష్ అన్నాడు. ఈ నియామకాలు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని ఇకనైనా అక్రమ నియామకాలను రద్దు చేసి వెంటనే డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. దానివల్ల ఎంతో మంది అర్హత కలిగిన నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నాడు. యూజీసీ నిబంధనలు పాటిస్తూ మళ్లీ నియామకాలు చేపట్టాలని... దీంతో విద్యార్థుల భవిష్యత్ మెరుగుపడుతుందని చెప్పాడు.

Also Read: చీరకట్టుతో కనికట్టు చేస్తోన్న అతిలోక సుందరి తనయ

Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Nov 2021 02:38 PM (IST) Tags: telangana nizamabad Nizamabad news Nizamabad Latest Updates TU South Campus Lo Akrama Niyamakalu TU South Campus

సంబంధిత కథనాలు

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు

బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News: లక్షన్నర పెట్టుబడికి రెండింతలు లాభం- బోడ కాక‌ర కాయ సాగుతో సిరులు

Nizamabad News: లక్షన్నర పెట్టుబడికి రెండింతలు లాభం- బోడ కాక‌ర కాయ సాగుతో సిరులు

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?