Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
Telangana Public Holidays 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవుల జాబితాను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాదికిగానూ ప్రభుత్వ సెలవులను ప్రకటించారు. 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవుల జాబితాను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 28 రోజులు సాధారణ సెలవులు, మరో 23 రోజులు ఐచ్ఛిక సెలవులుగా ప్రభుత్వం జీవో నంబరు 2618, 2619లో పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను 23 రోజులుగా శుక్రవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది.
సాధారణ సెలవులు..
జనవరి 1 - నూతన సంవత్సరం
జనవరి 14 - భోగి
జనవరి 15 - సంక్రాంతి
జనవరి 26 - గణతంత్ర దినోత్సవం
మార్చి 1 - మహాశివరాత్రి
మార్చి 18 - హోళీ
ఏప్రిల్ 2 - ఉగాది
ఏప్రిల్ 10 - శ్రీరామనవమి
ఏప్రిల్ 14 - అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15 - గుడ్‌ఫ్రైడే
మే 3 - రంజాన్
జులై 10 - బక్రీద్
జులై 25 - బోనాలు
ఆగస్టు 9 - మొహర్రం
ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 25 - బతుకమ్మ మొదటిరోజు
అక్టోబర్ 2 - గాంధీ జయంతి
అక్టోబరు 5 - విజయదశమి
అక్టోబర్ 9 - మిలాద్-ఉన్-నబి
అక్టోబర్ 25 - దీపావళి
నవంబర్ 11 - కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి
డిసెంబరు 25 - క్రిస్మస్
డిసెంబర్ 26 - బాక్సింగ్ డే
అయితే జనవరి 1 సెలవును పురస్కరించుకుని ఫిబ్రవరి 12 రెండో శనివారంను పనిదినంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 ఐచ్ఛిక సెలవులను పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఐచ్ఛిక సెలవులు..
ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.
వేతనంతో కూడిన సెలవు దినాలు..
జనవరి 15 - సంక్రాంతి
జనవరి 26 - గణతంత్ర దినోత్సవం
మార్చి 1 - మహాశివరాత్రి
మార్చి 18 - హోళీ
ఏప్రిల్ 2 - ఉగాది
ఏప్రిల్ - బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 10 - శ్రీరామనవమి
ఏప్రిల్ 14 - అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15 - గుడ్‌ఫ్రైడే
మే 1 - మే డే
మే 3 - రంజాన్
జులై 10 - బక్రీద్
ఆగస్టు 9 - మొహర్రం
ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 20 - శ్రీ క్రిష్ణాష్టమి
ఆగస్టు 31 - వినాయకచవితి
అక్టోబర్ 2 - గాంధీ జయంతి
అక్టోబరు 5 - విజయదశమి
అక్టోబర్ 9 - మిలాద్-ఉన్-నబి
అక్టోబర్ 25 - దీపావళి
నవంబర్ 11 - కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి
డిసెంబరు 25 - క్రిస్మస్