Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదుకాగా 311 మంది వైరస్ కారణంగా మరణించారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదుకాగా 14,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 311 మంది వైరస్‌తో మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,51,209కి పెరిగింది. గత 252 రోజుల్లో ఇదే అత్యల్పం.
11,903 new #COVID19 cases, 14,159 recoveries and 311 deaths in the last 24 hours.
— ANI (@ANI) November 3, 2021
Total vaccination 1,07,29,66,315 (41,16,230 in last 24 hours). pic.twitter.com/tnWbrkAEB8
మొత్తం రికవరీల సంఖ్య 3,36,97,740కి చేరింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.22%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) November 3, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/5vplwlYhlT pic.twitter.com/06eBhcZ0CP
#Unite2FightCorona
— Ministry of Health (@MoHFW_INDIA) November 3, 2021
➡️ More than 61.12 Cr COVID Tests conducted so far.
➡️ Weekly Positivity Rate currently at 1.18%.
➡️ Daily Positivity Rate at 1.11%; less than 2% for 30 consecutive days. pic.twitter.com/Y8fyMFP6j5
కేరళ..
కేరళలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 6,444 కరోనా కేసులు నమోదుకాగా 187 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 49,80,398కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 32,236కు చేరింది.
మొత్తం 14 జిల్లాల్లో అత్యధికంగా తిరువనంతపురంలో 990 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (916), త్రిస్సూర్ (780) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,078 కరోనా కేసులు నమోదుకాగా 48 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 66,12,965కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 1,40,274కి పెరిగింది.
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి