Boost Immunity: కరోనాను తట్టుకునేలా రోగనిరోధకశక్తిని ఇలా పెంచుకోండి.. హార్వర్డ్ పరిశోధకుల సూచనలు
కరోనా వేరియంట్లు విజృంభిస్తున్న వేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
వైరస్‌లు దాడిచేసినా వాటిని తట్టుకునే శక్తి శరీరానికి రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అయితే కొన్ని చెడు ఆహారపు, జీవనశైలి అలవాట్ల వల్ల ఈ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేసేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు అంటున్నారు హార్వర్డ్ పరిశోధకులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ధూమపానం చేయకూడదు
2. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తినాలి
3. రోజూ క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలి
4. అధిక బరువు పెరగకూడదు. మీ ఎత్తుకు తగ్గ బరువుండాలి
5. మద్యం మానేయాలి. మానలేని పరిస్థితిలో కనీసం తగ్గించాలి.
6. మాంసాహారాన్ని వండేటప్పుడు ముందుగా వాటిని శుభ్రంగా కడగాలి.
7. మాంసాహారాన్ని బాగా ఉడికించాకే తినాలి.
8. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడాలి.
9. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
10. తప్పనిసరిగా కోవిడ్ టీకాలు వేయించుకోవాలి.
మీ ఆహారమెనూలో ఇవి ఉండాల్సిందే...
1. సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష లాంటి పుల్లటి పండ్లు రోజూ ఒక్కటైనా తినాలి. వీటి వల్ల విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.
2. రెడ్ బెల్ పెప్పర్స్
ఎరుపు క్యాప్సికమ్‌ను కనీసం మూడురోజులకోసారైనా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో నారింజ కన్నా మూడు రెట్లు విటమిన్ సి లభిస్తుంది. వీటిలో బీటాకెరాటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
3. బ్రకోలి
విటమిన్ ఎ, సి, ఇ, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఇది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
4. వెల్లుల్లి
వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అధికం. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
5. అల్లం
కూరల్లో అల్లం వాడకాన్ని పెంచితే మంచిది. ఇది ఇన్ ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తుంది. గొంతునొప్పిని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు కూడా ఎక్కువ.
6. పాలకూర
రోజు తప్పించి రోజు పాలకూరతో చేసిన వంటకాలు తినాలి. బ్రకోలీలాగే పాలకూర కూడా విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది.
పెరుగు, బాదంపప్పులు, పసుపు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గ్రీన్ టీ, బొప్పాయి, కివీ, చికెన్... ఇవన్నీ వారంలో ఒకసారైనా తినాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.