FDA on Covid Vaccines: 50 ఏళ్లు పైబడిన వారందరికీ రెండో బూస్టర్ డోస్, ఫైజర్ వ్యాక్సిన్ పై FDA కీలక నిర్ణయం
FDA on Covid Vaccines: ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ రెండో బూస్టర్ డోస్ పై యూఎస్ ఎఫ్ డీఏ కీలన ప్రకటన చేసింది. 50 ఏళ్లు దాటిన వారు మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న నాలుగు నెలల తర్వాత రెండో బూస్టర్ డోస్ తీసుకోవచ్చని ప్రకటించింది.
FDA on Covid Vaccines: 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి COVID-19 వ్యాక్సిన్ రెండో బూస్టర్ డోస్‌కు అమెరికా ఎఫ్డీఏ( ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదం తెలిపింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న కనీసం నాలుగు నెలల తర్వాత రెండో బూస్టర్ డోస్ తీసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. "డేటా విశ్లేషణ ఆధారంగా ఫైజర్-బయోఎన్‌టెక్ లేదా మోడెర్నా కోవిడ్-19 టీకా రెండో బూస్టర్ డోస్ వ్యక్తుల్లో రక్షణ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది" అని FDA సెంటర్ ఫర్ బయోలాజిక్స్ కు చెందిన డాక్టర్ పీటర్ మార్క్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
FDA authorizes another booster dose of the Pfizer or Moderna COVID-19 vaccine for people age 50 and up, reports AP
— Press Trust of India (@PTI_News) March 29, 2022
మరో బూస్టర్ డోస్ తీసుకోవచ్చు
బూస్టర్ డోస్ అందుబాటులోకి రావడానికి ముందు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు సైన్ ఆఫ్ చేయాలని, కానీ అది ఎంత త్వరగా జరుగుతుందో స్పష్టంగా లేదని పీటర్ మార్క్స్ అన్నారు. రెండో బూస్టర్ డోస్ తీవ్రమైన COVID-19 నుంచి రక్షణను మరింత మెరుగుచేస్తుందని FDA తెలిపింది. అయితే ఈ రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపింది. వయస్సు, ఆరోగ్య స్థితి, కరోనా తీవ్ర దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. " వయసులో పెద్దవారికి ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి కరోనా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది" అని రిజల్వ్ టు సేవ్ లైవ్స్ హెడ్‌గా ఉన్న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ టామ్ ఫ్రైడెన్ అన్నారు. 55 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికే తీసుకున్న టీకాల ద్వారా ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మరో షాట్ గురించి అంతగా శ్రద్ధ చూపడని ఫ్రైడెన్ చెప్పారు. "మీరు బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. మీరు పొందకపోతే, అది నిజంగా మీ ఇష్టం," అని ఫ్రైడెన్ అంటున్నారు.
ఎవరు అర్హులంటే?
FDA తాజా నిర్ణయం ప్రకారం నాలుగు నెలల క్రితం ఫైజర్-బయోఎన్‌టెక్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌ను పొందిన 50, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా మరొక బూస్టర్ డోస్ పొందవచ్చు. వైద్య చికిత్స లేదా పరిస్థితుల కారణంగా బలహీనంగా ఉన్న 12 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి, మూడు మోతాదుల పొందిన పెద్ద వయసు వారు బూస్టర్ షాట్‌కు అర్హులు. రోగనిరోధక శక్తి లేని పెద్దలు మోడరన్ బూస్టర్‌ను అందుకోవచ్చు. ఇది మైనర్‌లలో ఉపయోగించడానికి అధికారం లేదని FDA తెలిపింది.